T20 World Cup: సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. ట్రోఫీ దక్కేది ఏ జట్టుకో తెలుసా.?

మరో 3 రోజుల్లో టీ20 వరల్డ్‌కప్ ముగియనుంది. మరికొద్ది గంటల్లో ఫైనల్ బెర్త్ కోసం నాలుగు జట్లు పోటీ పడనున్నాయి. భారత కాలమాన ప్రకారం.. మొదటి సెమీఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జూన్ 27 ఉదయం 6 గంటలకు జరగనుండగా.. రెండో సెమీఫైనల్ మ్యాచ్ రాత్రి 8 గంటలకు..

T20 World Cup: సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. ట్రోఫీ దక్కేది ఏ జట్టుకో తెలుసా.?
T20 World Cup 2024
Follow us

|

Updated on: Jun 26, 2024 | 8:06 PM

మరో 3 రోజుల్లో టీ20 వరల్డ్‌కప్ ముగియనుంది. మరికొద్ది గంటల్లో ఫైనల్ బెర్త్ కోసం నాలుగు జట్లు పోటీ పడనున్నాయి. భారత కాలమాన ప్రకారం.. మొదటి సెమీఫైనల్ మ్యాచ్ దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జూన్ 27 ఉదయం 6 గంటలకు జరగనుండగా.. రెండో సెమీఫైనల్ మ్యాచ్ భారత్, ఇంగ్లాండ్ మధ్య గురువారం రాత్రి 8 గంటలకు జరుగుతుంది. అయితే ఈ రెండు మ్యాచ్‌లకు వరుణుడు అడ్డంకిగా మారే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. అందుతున్న వెదర్ రిపోర్ట్ ప్రకారం.. ట్రినిడాడ్, గయానాలో నిరంతరం వర్షం కురవనుందని తెలుస్తోంది. దీన్ని బట్టి ఒకవేళ సెమీఫైనల్స్ రెండూ రద్దయితే.. ఏయే జట్లు ఫైనల్స్‌కి వెళ్తాయో.? ఐసీసీ నిబంధనలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

వర్షం పడితే.. ముందుగా దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌కు 90 నిమిషాలు అదనంగా ఇవ్వడంతో పాటు.. ఓ రిజర్వ్ డేను కూడా కేటాయించారు. మొదటి రోజు ఎక్కడైతే వర్షం పడినప్పుడు ఆట ఆగుతుందో.. తిరిగి అక్కడ నుంచే రిజర్వ్ డే ఆట కొనసాగుతుంది. ఇక భారత్, ఇంగ్లాండ్ సెమీఫైనల్ మ్యాచ్‌కి రిజర్వ్ డే లేదు. మ్యాచ్ రోజు వర్షం పడితే.. ఎక్స్‌ట్రా 250 నిమిషాలు కేటాయించింది ఐసీసీ.. అంటే.. అసలు 190 నిమిషాలతో పాటు అదనంగా 4 గంటల 10 నిమిషాలు ఈ మ్యాచ్ కోసందొరుకుతుంది.

ఇవి కూడా చదవండి

ఈ అదనపు సమయంలోనూ వర్షం పడి.. రెండు నాకౌట్ మ్యాచ్‌లు రద్దయితే.. సూపర్ 8 దశలో రెండు గ్రూప్‌లలోనూ అగ్రస్థానంలో నిలిచిన జట్లు.. అంటే.. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఫైనల్ మ్యాచ్‌లోనూ వర్షం ముప్పు ఉంటే.. రెండు జట్లను విజేతగా ప్రకటించనుంది ఐసీసీ.

ఇది చదవండి: కోహ్లీ స్థానంలో టీ20 మాన్‌స్టర్.. సెమీస్‌కు ముందుగా టీమిండియాలో కీలక మార్పులు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్..
కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్..
Horoscope Today: ఆ రాశి వారికి శుభవార్తలు అందుతాయి..
Horoscope Today: ఆ రాశి వారికి శుభవార్తలు అందుతాయి..
ట్యాబ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్‌ నుంచి కొత్త
ట్యాబ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? వన్‌ప్లస్‌ నుంచి కొత్త
బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..
బెడ్‌ రూమ్‌ విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.? జాగ్రత్త..
వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
వైసీపీ ఆఫీసులకు వరుస నోటీసులు.. ఏపీ హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ..
ఎన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి?
ఎన్ని రోజుల తర్వాత స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలి?
అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే
అతిగా కాఫీ తాగితే అనర్ధాలు తప్పవు.. రోజుకు ఎన్ని కప్పులు తాగాలంటే
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి
తరచూ అలసటగా.. బలహీనంగా అనిపిస్తుందా? ఈ బ్లడ్‌ టెస్ట్ చేయించుకోండి
తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..
తక్కువ ధరలో మంచి కార్ల కోసం చూస్తున్నారా.? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే..