AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HanumaVihari: నారా లోకేశ్‌, పవన్ కల్యాణ్‌లను కలిసిన క్రికెటర్ హనుమ విహారి.. కెరీర్‌పై కీలక నిర్ణయం

ప్రముఖ టీమిండియా క్రికెటర్ హనుమ విహారి నారా లోకేశ్ ను కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లాడీ ట్యాలెంటెడ్ క్రికెటర్. అయితే ఇప్పుడు ఏసీఏతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని నారా లోకేష్ హామీ ఇవ్వడంతో

HanumaVihari: నారా లోకేశ్‌, పవన్ కల్యాణ్‌లను కలిసిన క్రికెటర్ హనుమ విహారి.. కెరీర్‌పై కీలక నిర్ణయం
Nara lokesh, Hanuma Vihari, Pawan Kalyan
pullarao.mandapaka
| Edited By: |

Updated on: Jun 25, 2024 | 10:54 PM

Share

ప్రముఖ టీమిండియా క్రికెటర్ హనుమ విహారి నారా లోకేశ్ ను కలిశారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలను నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లాడీ ట్యాలెంటెడ్ క్రికెటర్. అయితే ఇప్పుడు ఏసీఏతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని నారా లోకేష్ హామీ ఇవ్వడంతో తిరిగి ఏసీఏ తరపునే ఆడాలని హనుమ విహారి నిర్ణయించుకున్నారు. ‘గత ప్రభుత్వం నా టాలెంట్ ను తొక్కేసింది. నేనుంటే వాళ్లకి ఇబ్బందని నాటి ఏసీఏ భావించింది. చిన్న విషయాన్ని పెద్దదిగా చూపి.. నాతో రాజీనామా చేయించారు. చెప్పిన వారిని టీంలో పెట్టుకోలేదని ఏసీఏ పెద్దలు నాపై కుట్ర పన్నారు. ఓ వైసీపీ కార్పోరేటర్ పేరు చెప్పి నాతో బలవంతంగా రిజైన్ చేయించారు. చంద్రబాబు, లోకేష్ ,పవన్ కళ్యాణ్ నాకు అండగా నిలబడ్డారు. ఏపీకి చెందిన వ్యక్తిని అయినప్పటికీ గత పాలకులు నన్ను ఇబ్బందులకు గురి చేశారు. అప్పటి ఏసీఏ వ్యవహరించిన తీరుతో వేరే రాష్ట్రం నుంచి ఆడాలని భావించాను. ఏసీఏ నుంచి NOC తీసుకుని వేరే రాష్ట్రం తరపున ఆడేందుకు ప్రయత్నించాను’ అని హనుమ విహారి ఆవేదన వ్యక్తం చేశాడు.

‘ఆంధ్రాలో క్రికెట్ ను ఎంకరేజ్ చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఏసీఏ తరపునే ఆడాలని నారా లోకేష్ సూచించారు. క్రీడల్లో రాజకీయాలు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. లోకేష్ హామీతో తిరిగి ఏసీఏ తరపునే ఆడాలని నిర్ణయించుకున్నాను’ అని హనుమ విహారి చెప్పుకొచ్చాడు.\

ఇవి కూడా చదవండి

నారా లోకేశ్ తో హనుమ విహారి…

పవన్ కల్యాణ్ ను కలవడం ఆనందంగా ఉంది..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..