AP News: ఏపీ ప్రజలకు ‌గుడ్‌న్యూస్.. ఆ స్టేషన్ వరకు వందేభారత్ రైలు పొడిగింపు.!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. మరీ ముఖ్యంగా భీమవరం, ఏలూరు, పాలకొల్లు, కైకలూరు వాసులకు ఇది అద్దిరిపోయే శుభవార్త. వచ్చే నెల నుంచి భీమవరం మీదుగా వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. ప్రస్తుతం చెన్నై-విజయవాడ మధ్య నడుస్తోన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను భీమవరం వరకు పొడిగించేందుకు..

AP News: ఏపీ ప్రజలకు ‌గుడ్‌న్యూస్.. ఆ స్టేషన్ వరకు వందేభారత్ రైలు పొడిగింపు.!
Vande Bharat Train
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 24, 2024 | 5:42 PM

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. మరీ ముఖ్యంగా భీమవరం, ఏలూరు, పాలకొల్లు, కైకలూరు వాసులకు ఇది అద్దిరిపోయే శుభవార్త. వచ్చే నెల నుంచి భీమవరం మీదుగా వందేభారత్ రైలు పరుగులు పెట్టనుంది. ప్రస్తుతం చెన్నై-విజయవాడ మధ్య నడుస్తోన్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను భీమవరం వరకు పొడిగించేందుకు చెన్నై రైల్వే అనుమతులిచ్చింది. ఈ స్టోరీ ఏంటని అనుకుంటున్నారా.? మరి లేట్ అదేంటో తెలుసుకుందామా..

వివరాల్లోకెళ్తే.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తోన్న వందేభారత్ సర్వీసులను పశ్చిమగోదావరి వాసులు ఎక్కాలంటే.. రాజమండ్రి లేదా విజయవాడ వెళ్లాల్సి వస్తోంది. దీంతో మాంచి రద్దీగా ఉండే విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను తాడేపల్లిగూడెం లేదా ఏలూరు స్టేషన్‌ స్టాప్ ఇవ్వాలన్న ప్రతిపాదనలను ఇవ్వగా.. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ దీనికి అనుమతి నిరాకరించింది. ఇక అటు చెన్నై-విజయవాడ వందేభారత్ రైలుకి.. బెజవాడ స్టేషన్‌లో ఉంచేందుకు ప్లాట్‌ఫార్మ్ ఇబ్బందులు తలెత్తడంతో.. ఈ సర్వీసును భీమవరం వరకు పొడిగించడానికి చెన్నై డివిజన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో జూలై నెల నుంచి భీమవరం నుంచి చెన్నై వయా విజయవాడ మీదుగా వందేభారత్ పరుగులుపెట్టనుంది.

ఇది చదవండి: అలెర్ట్.! మీ IRCTC ఐడీతో ఇతరులకు టికెట్ బుక్ చేస్తే.. ఇక జైలుకే

చెన్నై-విజయవాడ వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఉదయం సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో 5.30 గంటలకు బయల్దేరి.. మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఇక అక్కడ నుంచి తిరిగి మధ్యాహ్నం 3.20 గంటలకు చెన్నై ప్రయాణం అవుతుంది. వచ్చే సమయానికి.. వెళ్లే సమయానికి మధ్య దాదాపు 3 గంటల వ్యవధి ఉండటం.. వందేభారత్ కంటూ ప్రత్యేకంగా ఒక ఫ్లాట్‌ఫార్మ్ కేటాయించాల్సిన అవసరం ఉండటం.. రద్దీగా ఉండే బెజవాడ డివిజన్ రైల్వే అధికారులకు ఇబ్బందిగా మారిందట. విజయవాడ నుంచి భీమవరానికి గంట ప్రయాణం పట్టే అవకాశం ఉండటంతో.. ఈ వందేభారత్ రైలును అక్కడ వరకు పొడిగించాలని నిర్ణయానికి వచ్చారట.

భీమవరం నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వందేభారత్ బయల్దేరేలా షెడ్యూల్ రెడీ చేస్తున్నారట. షెడ్యూల్‌లో చిన్నచిన్న మార్పులు ఉన్నప్పటికీ.. వందేభారత్ రైలును చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌కి రాత్రి 10 గంటలకు చేరుకునేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు రైల్వే అధికారులు. భీమవరం వరకు వందేభారత్ రైలు అందుబాటులోకి వస్తే.. పశ్చిమగోదావరి జిల్లా వాసులకు కాస్త ఊరట లభిస్తుందని చెప్పొచ్చు. ఈ రైలు పగటిపూట ప్రయాణిస్తుంది కాబట్టి.. ఒంగోలు, నెల్లూరు మీదుగా చెన్నై వెళ్లే ప్రయాణికులకు, వ్యాపారులకు ఇది కలిసొచ్చే అంశం. కాగా, ఈ వందేభారత్ సామర్ధ్యానికి తగ్గట్టుగా ఇప్పటికే రైల్వే శాఖ ట్రాక్ పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేసింది.

ఇది చదవండి: సూపర్ కూల్ న్యూస్.. ఏపీలో వచ్చే 3 రోజులు కుండబోత.. ఈ జిల్లాలకు.!

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్