AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది కదా అంబానీ రేంజ్ అంటే..! అనంత్ అంబానీ ఒక్కో వెడ్డింగ్ కార్డు ధర తెలిస్తే..

అనంత్ అంబానీ ఒక్కో వెడ్డింగ్ కార్డు ధర ఎంతో తెలుసా.? అక్షరాలా రూ. 6.50 లక్షలు. మూడు కేజీల వెండి దేవాలయంలో 24 క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డు ఇది. అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల..

ఇది కదా అంబానీ రేంజ్ అంటే..! అనంత్ అంబానీ ఒక్కో వెడ్డింగ్ కార్డు ధర తెలిస్తే..
Anant Ambani Radhika Merchant
Eswar Chennupalli
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 27, 2024 | 9:57 AM

Share

అనంత్ అంబానీ ఒక్కో వెడ్డింగ్ కార్డు ధర ఎంతో తెలుసా.? అక్షరాలా రూ. 6.50 లక్షలు. మూడు కేజీల వెండి దేవాలయంలో 24 క్యారెట్ల బంగారు విగ్రహాలతో కూడిన వెడ్డింగ్ కార్డు ఇది. అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహ వేడుక ముచ్చట్లు చూస్తున్నా, ఎంత వింటున్నా.. తనివి తీరడం లేదు. ఇండియాలోనే అత్యంత ఖరీదైన వివాహంగా గుర్తించబడ్డ ఈ వివాహానికి సంబంధించి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆహ్వాన పత్రిక ఖర్చు అక్షరాలా రూ. 6.5 లక్షలు. గతంలో కూడా అంబానీ కూతురు ఇషా అంబానీ వివాహ పత్రిక ధర మూడు లక్షలు అంటే.. అందరూ నోరెళ్ళబెట్టారు. బుధవారం సాయంత్రం కొంతమంది ముఖ్యమంత్రులకు, ఇతర వీవీఐపీలకు ఇచ్చిన ఈ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వెడ్డింగ్ కార్డు వివరాలు తెలిసిన పలువురు.. దాని విలువతో మాలాంటి వాళ్లు ఒక పెళ్లి చేసేసుకోవచ్చంటూ పెడుతున్న కామెంట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

వెడ్డింగ్ కార్డులో వెండి గుడితో పాటు బంగారు విగ్రహాలు..

అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం జూలై 12న ముంబైలో జరగనుంది. వైరల్ అవుతున్న వివాహ ఆహ్వానం ప్రకారం, ఈ జంట పెళ్లికి ముందు, తర్వాత అనేక వేడుకలను నిర్వహించనున్నారు. వెండితో చేసిన చిన్న గుడి లాంటి పెట్టె. పెట్టె తెరవగానే బ్యాక్ గ్రౌండ్‌లో హిందీలో విష్ణు సహస్రనామం వినిపిస్తోంది. పెట్టె లోపల 24 క్యారెట్‌ల బంగారు విగ్రహాలు కూడా ఉండడం అందరినీ ఆకర్షించింది. వెండి కార్డు బ్యాక్ గ్రౌండ్‌లో మంత్రాలు ప్లే చేయబడిన పురాతన దేవాలయం ప్రధాన ద్వారంలా కనిపిస్తుంది. కార్డులో మొదట గణేష్, విష్ణువు, లక్ష్మీదేవి, రాధా-కృష్ణ, దుర్గాదేవి వంటి అనేక హిందూ దేవతల బంగారు చిత్రాలు ఉన్నాయి. ఆలయం గేటు తెరిచినప్పుడు, ఎవరైనా ఆలయ స్టాండ్ బయటకు తీయవచ్చు.

లోపల మరొక వెండి పెట్టె..

అంబానీల వివాహ ఆహ్వాన పత్రికలో మరొక వెండి పెట్టె ఉంటుంది. దాని ముందు భాగంలో విష్ణువు బొమ్మ ఉంది. పెట్టెను తెరిచినప్పుడు, దానిలో ఓం అని ఎంబ్రాయిడ్ చేయబడిన ఒక శాలువ, నెట్ హాంకీ ఉన్నాయి. ఆ పెట్టెలో బంగారంతో అలంకరించబడిన వివిధ హిందూ విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: లేడీస్.! మీ భర్త మీ మాటే వినాలనుకుంటున్నారా.? ఇలా కొంగుతో కట్టిపారేయండి..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..