Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి సూపర్ న్యూస్.. బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. తులం ఎంతంటే?

గోల్డ్ ప్రియులకు నిజంగానే ఇది గుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత ఐదు రోజులుగా గోల్డ్ రేట్స్ సుమారు రూ. 1,250 మేరకు తగ్గాయి. విదేశాల్లో బంగారం నిల్వలు తగ్గడంతో.. దాని ప్రభావం దేశంలోని పసిడి ధరలపై పడిందని నిపుణులు అంటున్నారు.

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి సూపర్ న్యూస్.. బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. తులం ఎంతంటే?
Gold Price Latest
Follow us
Ravi Kiran

|

Updated on: Jun 27, 2024 | 8:49 AM

గోల్డ్ ప్రియులకు నిజంగానే ఇది గుడ్ న్యూస్.. బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. గత ఐదు రోజులుగా గోల్డ్ రేట్స్ సుమారు రూ. 1,250 మేరకు తగ్గాయి. విదేశాల్లో బంగారం నిల్వలు తగ్గడంతో.. దాని ప్రభావం దేశంలోని పసిడి ధరలపై పడిందని నిపుణులు అంటున్నారు. గురువారం(జూన్ 27) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 260 మేరకు తగ్గి రూ. 65, 990గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 240 తగ్గి రూ. 71, 990 దగ్గర కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లోనూ బంగారం ధరల్లోనూ స్వల్పం తేడాలు కనిపిస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 66,140గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 72,650 దగ్గర కొనసాగుతోంది. అలాగే ఆర్ధిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 65,990గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,990గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65,990 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71,990గా ఉంది.

వెండి ధరలు ఇలా..

వెండి కూడా బంగారాన్ని అనుసరిస్తోంది. గడిచిన ఐదు రోజుల్లో ఏకంగా రూ. 4,100 మేరకు తగ్గింది. గతంలో రూ. లక్ష దాటిన వెండి ధర.. ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. హైదరాబాద్, కేరళ, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో కిలో వెండి రూ. 94,400 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, పూణే నగరాల్లో కిలో వెండి రూ. 89,900గా ఉంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: లేడీస్.! మీ భర్త మీ మాటే వినాలనుకుంటున్నారా.? ఇలా కొంగుతో కట్టిపారేయండి..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..