Amazons Parcels: అమెజాన్ నుంచి ఈ పార్శిళ్లు అస్సలు తీసుకోకండి.. ఈ సీక్రెట్ విషయం గురించి మీకు తెలుసా?
Amazons Secret Warning: అమెజాన్ నుండి వచ్చే పార్శిల్స్‌లో పింక్ లేదా ఎరుపు రంగు చుక్కలు కనిపిస్తే అస్సలు తీసుకోరాదని అమెజాన్ స్పష్టం చేసింది. రవాణా సమయంలో పార్శిల్స్ తెరిచి, వస్తువులను మార్చకుండా నిరోధించడానికి ఈ రహస్య గుర్తులు ఉపయోగపడతాయి. అలాంటి చుక్కలు కనిపిస్తే, పార్శిల్ తీసుకోకుండా డెలివరీ బాయ్‌కి తిరిగి ఇచ్చేయాలి.

మీరు తరచుగా Amazonలో షాపింగ్ చేస్తుంటే మీ పార్శిల్ డెలివరీకి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. Amazon స్పష్టంగా సూచించిన దాని ప్రకారం.. మీకు వచ్చిన పార్శిల్ బాక్స్ మీద పింక్ లేదా ఎరుపు రంగు చుక్కలు కనిపిస్తే ఆ పార్శిల్ ను అస్సలు స్వీకరించవద్దు. దీని వెనుక అసలైన కారణాలు ఉన్నాయి. Amazon తన పార్శిల్ లేబుల్స్ పైన కొన్ని రహస్య చుక్కలను ఉపయోగిస్తుంది. ఈ చుక్కలు రవాణా ప్రక్రియలో పార్శిల్ ఎవరైనా ఓపెన్ చేశారా? లేదా అని సూచిస్తాయి. కొందరు దుండగులు రవాణా సమయంలో పార్శిల్ లేబుల్‌ను వేడి చేసి, దాన్ని తెరిచి, లోపలి వస్తువులను దొంగిలించి, వాటి స్థానంలో సబ్బులు లేదా రాళ్లను ఉంచి తిరిగి ప్యాక్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
లేబుల్‌ను వేడి చేసినప్పుడు ఈ రహస్య చుక్కలు పింక్ లేదా ఎరుపు రంగులోకి మారతాయి. అందుకే మీ చేతికి పార్శిల్ వచ్చినప్పుడు దాని లేబుల్‌పై పింక్ లేదా ఎరుపు రంగు చుక్కలు ఉంటే ఆ పార్శిల్ ఎవరో మధ్యలో తెరిచారని అర్థం. అటువంటి సందర్భంలో మీరు ఆ పార్శిల్ ను తిరస్కరించి, డెలివరీ చేసే వ్యక్తికి తిరిగి ఇచ్చేయాలి.
ఇది కూడా చదవండి: Hero vs TVS: హీరో స్ప్లెండర్ vs టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్.. ఏ బైక్ కొనడం మంచిది?
మీరు Amazon నుండి తరచుగా ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తుంటే, మీ డెలివరీలను సురక్షితంగా స్వీకరించడానికి ఈ కీలకమైన అంశం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ చేతికి అందిన పార్శిల్ బాక్స్ పైన పింక్ లేదా ఎరుపు రంగు చుక్కలు ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్శిల్ స్వీకరించకూడదు. ఈ విధానం వినియోగదారులను మోసం నుండి కాపాడటానికి రూపొందించబడింది.
Amazon తన పార్శిల్ లేబుల్స్, సీల్స్ పై కొన్ని రహస్య గుర్తులను లేదా సీక్రెట్ డాట్స్ ను ఉపయోగిస్తుంది. ఈ చుక్కలు సాధారణంగా కనిపించవు లేదా స్పష్టంగా గుర్తించలేరు. అయితే, ఇవి పార్శిల్ భద్రతను పర్యవేక్షించేందుకు ఒక అంతర్గత యంత్రాంగంగా పనిచేస్తాయి. పార్శిల్ రవాణాలో ఉన్నప్పుడు, కొన్ని సందర్భాలలో దుండగులు వాటిని అక్రమంగా తెరవడానికి ప్రయత్నిస్తారు. పార్శిల్ లేబుల్‌ను తెరిచేందుకు వారు వేడిని ఉపయోగిస్తారు. దీనివల్ల లేబుల్ సీల్ కరుగుతుంది లేదా బలహీనపడుతుంది.
ఇది కూడా చదవండి: Credit Card: ఈ ఏడుగురు వ్యక్తులకు క్రెడిట్ కార్డులు శత్రువుగా మారవచ్చు.. జాగ్రత్త.. ఎందుకంటే..!
ఈ రహస్య చుక్కల ప్రత్యేకత ఏమిటంటే, వాటికి వేడి తగిలినప్పుడు అవి రంగు మారతాయి. అంటే లేబుల్‌ను వేడి చేసినప్పుడు ఈ చుక్కలు పింక్ లేదా ఎరుపు రంగులోకి మారుతాయి. ఈ రంగు మార్పు అనేది పార్శిల్ ఓపెన్ చేశారనపి లేదా ట్యాంపర్ జరిగిందని తెలియడానికి స్పష్టమైన సూచన.
అందుకే, మీ డెలివరీ పార్శిల్ ను స్వీకరించే ముందు దాని లేబుల్ లేదా సీల్‌ను జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం. ఒకవేళ ఆ లేబుల్‌పై పింక్ లేదా ఎరుపు రంగు చుక్కలు కనబడితే, అది పార్శిల్ మధ్యలో ఎవరో తెరిచి, అందులోని వస్తువులను మార్చారనడానికి రుజువు. ఇటువంటి పరిస్థితిలో మీరు ఆ పార్శిల్ ను అస్సలు తీసుకోకూడదు. వెంటనే డెలివరీ బాయ్‌కి ఈ విషయాన్ని తెలియజేసి, పార్శిల్ ను తిరిగి పంపమని స్పష్టంగా చెప్పాలి. Amazon స్వయంగా ఈ మార్గదర్శకాన్ని జారీ చేసింది. వినియోగదారుల భద్రత, విశ్వసనీయతను కాపాడటం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ జాగ్రత్త తీసుకోవడం ద్వారా మీరు నష్టపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

Amazons Secret Warning
ఇది కూడా చదవండి: LIC Police: ఎల్‌ఐసీలో అద్భుతమైన ప్లాన్.. కేవలం రూ.150 ఆదా చేస్తే చేతికి రూ.26 లక్షలు!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




