Amazon Republic Day Sale 2022: అమెజాన్ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్.. నమ్మశక్యం కాని ఆఫర్లు..

Amazon Republic Day Sale 2022: రిపబ్లిక్ డేకి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉంది. దీంతో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభించేందుకు

Amazon Republic Day Sale 2022: అమెజాన్ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్.. నమ్మశక్యం కాని ఆఫర్లు..
Amazon
Follow us
uppula Raju

|

Updated on: Jan 11, 2022 | 7:05 PM

Amazon Republic Day Sale 2022: రిపబ్లిక్ డేకి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉంది. దీంతో అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభించేందుకు సిద్దంగా ఉంది. దాదాపు ఐదు రోజులు ఈ సేల్‌ ఆఫర్ ఉంటుందని తెలుస్తోంది. కానీ కంపెనీ ఇంకా తేదీని ప్రకటించలేదు. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సంప్రదాయకంగా మొబైల్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఉపకరణాలు, గృహోపకరణాలు కొనుగోలుపై డిస్కౌంట్‌లు, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తుంది. Apple, Samsung, Xiaomi, OnePlus, Realme, Tecno మొదలైన స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ ఉత్పత్తులను జాబితా చేస్తారు.

అయితే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎస్‌బీఐ తన కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్స్ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో కొనుగోలు చేసే వస్తువుల మీద 10 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ ను అందిస్తుంది. ఈ సేల్ ఎప్పటి లాగానే అమెజాన్ ప్రైమ్ సభ్యులకు 24 గంటల ముందుగానే ప్రారంభమవుతాయి. ఈ రిపబ్లిక్ డే సేల్‌లో ఎలక్ట్రానిక్ వస్తువుల మీద 40 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తే, ఫ్యాషన్ వస్త్రాల మీద 80 శాతం డిస్కౌంట్ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. కాగా, ఈ సేల్‌లో ముఖ్యంగా లేటేస్ట్ ఫోన్లు అయిన వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ, శాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ, ఐక్యూ జెడ్ 5జీ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.

మొబైల్ ఫోన్ల యాక్సెసరీలపై 40 శాతం వరకు రాయితీలు ఇస్తోంది. SBIతో పాటు, ICICI బ్యాంక్ కార్డ్‌లు, బజాజ్ ఫిన్‌సర్వ్ కూడా ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్‌లను అందిస్తాయి. స్మార్ట్‌వాచ్‌ల తగ్గింపు మరింత ఎక్కువగా ఉంటుంది. సేల్ సమయంలో స్మార్ట్ టీవీలు, పెద్ద ఉపకరణాలు తగ్గింపు ధరలపై అందుబాటులో ఉంటాయి. అమెజాన్ సొంత ఉత్పత్తులైన ఎకో స్మార్ట్ స్పీకర్లను సగం ధరకు, ఫైర్ స్టిక్ వంటి వాటిని తగ్గింపు ధరలకు అందిస్తుంది.

సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం..

RRB NTPC రిజల్ట్‌ డేట్‌ ప్రకటన.. CBT-2 షెడ్యూల్ కూడా తెలుసుకోండి..

IND VS SA: పుట్టిన రోజున రాహుల్‌ ద్రావిడ్‌కి షాక్.. రికార్డ్‌ బ్రేక్ చేసిన కోహ్లీ.. అదేంటంటే..?