AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం..

Senior Citizen: దేశ వ్యాప్తంగా సీనియర్ సిటిజన్లు తమ వడ్డీ రేట్లు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్‌ను అంగీకరిస్తే

సీనియర్ సిటిజన్లకు గుడ్‌న్యూస్‌.. త్వరలో ఆ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం..
Senior Citizen
Follow us
uppula Raju

|

Updated on: Jan 11, 2022 | 5:52 PM

Senior Citizen: దేశ వ్యాప్తంగా సీనియర్ సిటిజన్లు తమ వడ్డీ రేట్లు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్‌ను అంగీకరిస్తే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం వడ్డీ రేట్లను 100-200 బేసిస్ పాయింట్లు పెంచాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. ఇది జరిగితే రాబోయే రోజుల్లో సీనియర్ సిటిజన్‌ల కోసం అమలు చేసే పథకాలపై అదనపు వడ్డీని పొందవచ్చు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతున్న చోట, వడ్డీ రేట్లు మునుపటితో పోలిస్తే తగ్గాయి. ద్రవ్యోల్బణం దృష్ట్యా వడ్డీ రేట్లు పెరగాలి. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే ప్రస్తుతం బ్యాంకులు ఇస్తున్న వడ్డీ రేటు పెంచాలని సీనియర్ సిటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో వారి రోజువారీ ఖర్చులు సులువుగా తీరుతాయి.

వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని సీనియర్ సిటిజన్‌లకు అందించడానికి ప్రభుత్వం బ్యాంకులకు ప్రోత్సాహకాలు అందించవచ్చు. పన్ను మినహాయింపు ఇవ్వవచ్చు లేదా వారి డిపాజిట్ బీమా ప్రీమియం తగ్గించవచ్చు. దీని వల్ల బ్యాంకులు ప్రయోజనం పొంది సీనియర్ సిటిజన్ల వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం.. వాణిజ్య బ్యాంకుల సగటు దేశీయ టర్మ్ డిపాజిట్ రేట్లు నవంబర్ 2013లో 8.76 శాతం నుంచి 372 బేసిస్ పాయింట్లు తగ్గాయి. నవంబర్ 2021లో ఇది 8.76 శాతం నుంచి 5.04 శాతానికి పడిపోయింది. రూ.లక్ష డిపాజిట్ చేసిన మూలధనంపై ఏడాదిలో వడ్డీ రూపంలో వచ్చే ఆదాయం రూ.3,720కి తగ్గింది. మరోవైపు ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతోంది. ఈ పరిస్థితిలో సీనియర్ సిటిజన్లకు అతిపెద్ద నష్టం ఎందుకంటే వారి ఖర్చులు లేదా రోజువారీ పని కేవలం బ్యాంకుల నుంచి వచ్చే సంపాదనతో మాత్రమే జరుగుతుంది.

ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్స్ కాన్ఫెడరేషన్ (AISSCON) జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ.. బ్యాంకులు ప్రస్తుతం సీనియర్ సిటిజన్‌లకు కార్డ్ రేట్లపై 50 బేసిస్ పాయింట్ల అదనపు వడ్డీని ఇస్తున్నాయని చెప్పారు. బ్యాంకులు ఈ రేటును 150-200 బేసిస్ పాయింట్లకు పెంచాలని కోరారు. సీనియర్ సిటిజన్లు బ్యాంకుల్లో డిపాజిట్ చేసే డబ్బు బ్యాంకులకు స్థిరమైన మూలధనం. నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్యాంకుల్లో డిపాజిట్ చేయబడిన మొత్తం డబ్బులో 20 శాతం సీనియర్ సిటిజన్ల డబ్బు ఉంటుంది. బ్యాంకులు సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై కనీసం మూడేళ్లపాటు అధిక వడ్డీ రేట్లను అందించాలని బ్యాంకింగ్ నిపుణులు కోరుతున్నారు.

IND VS SA: పుట్టిన రోజున రాహుల్‌ ద్రావిడ్‌కి షాక్.. రికార్డ్‌ బ్రేక్ చేసిన కోహ్లీ.. అదేంటంటే..?

RRB NTPC రిజల్ట్‌ డేట్‌ ప్రకటన.. CBT-2 షెడ్యూల్ కూడా తెలుసుకోండి..

కరోనా సమయంలో పసుపు అధికంగా వాడుతున్నారా..! జాగ్రత్త శరీరంపై ఈ దుష్ప్రభాలు..