AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND VS SA: పుట్టిన రోజున రాహుల్‌ ద్రావిడ్‌కి షాక్.. రికార్డ్‌ బ్రేక్ చేసిన కోహ్లీ.. అదేంటంటే..?

IND VS SA: టీమిండియా క్రికెట్‌ అభిమానులు ఈ రోజు కోచ్ రాహుల్‌ ద్రావిడ్‌ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ద వాల్‌గా

IND VS SA: పుట్టిన రోజున రాహుల్‌ ద్రావిడ్‌కి షాక్.. రికార్డ్‌ బ్రేక్ చేసిన కోహ్లీ.. అదేంటంటే..?
Rahul Dravid
uppula Raju
|

Updated on: Jan 11, 2022 | 5:05 PM

Share

IND VS SA: టీమిండియా క్రికెట్‌ అభిమానులు ఈ రోజు కోచ్ రాహుల్‌ ద్రావిడ్‌ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ద వాల్‌గా పేరుగాంచిన ద్రవిడ్‌కు నేటితో 49 ఏళ్లు. ప్రస్తుతం సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో టీమ్ ఇండియా మూడో నిర్ణయాత్మక టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. అక్కడే ద్రావిడ్ జట్టు సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలు జరుపుకోనున్నాడు. కాగా తన పుట్టిన రోజు రోజున రాహుల్ ద్రవిడ్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ అనుకోని షాక్ ఇచ్చాడు.

నిజానికి దక్షిణాఫ్రికాలో అత్యధిక టెస్టు పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో రాహుల్ ద్రవిడ్‌ను విరాట్ కోహ్లీ అధిగమించాడు. కేప్ టౌన్‌లో విరాట్ కోహ్లీ 14 పరుగులు చేసిన వెంటనే, దక్షిణాఫ్రికాలో అతని పరుగుల సంఖ్య 625కి చేరింది. దక్షిణాఫ్రికాలో రాహుల్ ద్రవిడ్ 29.7 సగటుతో 611 పరుగులు చేశాడు. దక్షిణాఫ్రికాలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్. 46.4 సగటుతో 1161 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ ఇప్పటికీ అతని కంటే చాలా వెనుకబడి ఉన్నాడు. అయితే ఈ బ్యాట్స్‌మన్ ఫామ్‌లో ఉంటే బహుశా సచిన్ రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశాలు ఉన్నాయి.

దక్షిణాఫ్రికాలో టెస్ట్ సగటు 50 కంటే ఎక్కువ ఉన్న భారతదేశంలోని ఏకైక బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ. దీంతో పాటు అతను దక్షిణాఫ్రికాలో 2 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు కూడా చేశాడు. విరాట్ కోహ్లీ సౌతాఫ్రికాలో వన్డే ఫార్మాట్‌లో కూడా చాలా పరుగులు చేశాడు. విరాట్ 13 ODI ఇన్నింగ్స్‌లలో 86.88 సగటుతో 3 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో 782 పరుగులు చేయడం విశేషం.

కరోనా సమయంలో పసుపు అధికంగా వాడుతున్నారా..! జాగ్రత్త శరీరంపై ఈ దుష్ప్రభాలు..

పచ్చి ఉల్లిపాయ తింటే నోటి దుర్వాసన భరించలేరు.. ఆ సమయంలో సింపుల్‌గా ఇలా చేయండి..

Makar Sankranti 2022: సంక్రాంతి స్పెషల్‌.. నువ్వులు, బెల్లం లడ్డూలు.. చలికాలంలో ఆరోగ్యానికి చాలా మేలు