Chris Morris: ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడి షాకింగ్‌ నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు..

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర (రూ.16.25 కోట్లు) పలికిన ఈ స్టార్‌ క్రికెటర్‌ ఆటకు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు.

Chris Morris: ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడి షాకింగ్‌ నిర్ణయం.. అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు..
Chris Morris
Follow us
Basha Shek

|

Updated on: Jan 11, 2022 | 6:40 PM

దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్‌ మోరిస్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధర (రూ.16.25 కోట్లు) పలికిన ఈ స్టార్‌ క్రికెటర్‌ ఆటకు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని అతనే సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించాడు. ‘ నేను అన్ని రకాల ఫార్మాట్‌ల నుంచి తప్పుకుంటున్నాను. నా జీవిత ప్రయాణంలో నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. టైటాన్‌ జట్టుకు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడం పట్ల ఎంతో ఆనందంగా ఉన్నాను ‘ అని రాసుకొచ్చాడు. కాగా రిటైర్మెంట్‌ తర్వాత మోరిస్‌ దేశవాళీ టీ20 జట్టుకు కోచ్‌గా పగ్గాలు తీసుకోనున్నాడు.

ఐపీఎల్ మెగా వేళానికి ముందు..

కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా క్రిస్‌ మోరిస్‌ రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్‌ 2021 మినీ వేలంలో భాగంగా జట్టు అతడిని 16.25 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. అయితే  ఆధరకు తగ్గ ప్రదర్శన మాత్రం చేయలేకపోయాడు.   గత సీజన్లో మొత్తం  11 మ్యాచ్‌లు ఆడిన మోరిస్  15 వికెట్లు నేలకూల్చాడు. కేవలం 67 పరుగులు మాత్రమే  చేశాడు. కాగా ఐపీఎల్ -2022 మెగా వేలానికి ముందు మోరిస్ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక మోరిస్‌ కెరీర్ ను పరిశీలిస్తే.. 2013లో వన్డేల్లో అరంగేట్రం చేసిన అతను మరో మూడేళ్లకు కానీ టెస్ట్‌ క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు.

మోరిస్  ఆడింది కొన్ని మ్యాచ్‌లైనా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మొత్తంగా దక్షిణాఫ్రికా తరఫున 4 టెస్టులు, 42 వన్డేలు, 23 టీ20 మ్యాచ్‌లు ఆడాడు ఈ స్టార్ ఆల్ రౌండర్ . 2019లో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. ఇక ఐపీఎల్‌ కెరీర్‌ విషయానికొస్తే మొత్తం 81 మ్యాచ్‌లు ఆడిన క్రిస్‌ మోరిస్‌ 618 పరుగులు చేశాడు. 95 వికెట్లు పడగొట్టాడు.

View this post on Instagram

A post shared by Chris Morris (@tipo_morris)

Also read:

Saina Nehwal: హీరో సిద్ధార్థకు కౌంటరిచ్చిన సైనా తండ్రి.. అతను దేశం కోసం ఏం చేశాడంటూ..

Coronavirus: కరోనా బారిన పడిన టీమిండియా ఆల్‌రౌండర్‌.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరం..

IPL 2022: ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వివో ఔట్‌.. కొత్త స్పాన్సర్‌ ఎవరంటే..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ