IND vs SA: 223 పరుగులకే చాప చుట్టేసిన భారత్.. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ..
IND vs SA: సౌతాఫ్రికా, భారత్ మధ్య కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో మొదటి రోజు సఫారీలదే పైచేయిగా నిలిచింది. వరుసగా వికెట్లు
IND vs SA: సౌతాఫ్రికా, భారత్ మధ్య కేప్‌టౌన్‌లో జరుగుతున్న మూడో టెస్ట్‌లో మొదటి రోజు సఫారీలదే పైచేయిగా నిలిచింది. వరుసగా వికెట్లు తీస్తూ భారత్‌ని కోలుకోలేని దెబ్బతీసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో పోరాడాడు. పూజారా మినహాయించి ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా సౌతాఫ్రికా బౌలర్లు మూకుమ్మడిగా రాణించారు. దీంతో భారత్ 77.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబడా 4, జాన్సన్ 3, ఓలివర్ 1, మహరాజ్ 1, ఎంగిడి 1 వికెట్ సాధించారు.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కెఎల్ రాహుల్ నిరాశపరిచారు. త్వరగానే ఔట్ కావడంతో జట్టు బాధ్యతలు కెప్టెన్ కోహ్లీ, పూజారా తీసుకున్నారు. నిలకడగా ఆడుతూ జట్టు స్కోరుని పెంచారు. ఈ క్రమంలో పుజారా 77 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో 43 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన అజింకా రహానె 9 పరుగులకే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్‌తో కలిసి కోహ్లీ ఐదో వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం అందించారు. 27 పరుగుల వద్ద పంత్ ఔటయ్యాడు. ఆ తర్వాత ఎవ్వరూ పెద్దగా రాణించలేదు. కెప్టెన్ విరాట్ కోహ్లీ 201 బంతుల్లో 12 ఫోర్లు ఒక సిక్సర్‌తో 79 పరుగులు చేసి తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 28 హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం భారత్ 223 పరుగులకు ఆలౌట్ అయింది.