Saina Nehwal: హీరో సిద్ధార్థకు కౌంటరిచ్చిన సైనా తండ్రి.. అతను దేశం కోసం ఏం చేశాడంటూ..

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారణి సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.

Saina Nehwal: హీరో సిద్ధార్థకు కౌంటరిచ్చిన సైనా తండ్రి.. అతను దేశం కోసం ఏం చేశాడంటూ..
Follow us
Basha Shek

|

Updated on: Jan 11, 2022 | 9:39 PM

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు సైనాకు సపోర్ట్ చేస్తూ సిద్ధార్థ తీరును ఎండగట్టిన సంగతి తెలిసిందే. జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ రేఖాశర్మ, కేంద్ర న్యాయ శాఖా మంత్రి కిరణ్‌ రిజిజు సహా పలువురు ప్రముఖులు సైనాకు అండగా నిలబడ్డారు. ఒక ఒలింపియన్‌ ఛాంపియన్‌ అయిన సైనాపై ఇలాంటి నీచపు వ్యాఖ్యలు చేయడం సరికాదని సిద్ధార్థ్‌ తీరుపై మండిపడుతున్నారు. తాజాగా సైనా తండ్రి హర్వీర్‌ సింగ్‌ నెహ్వాల్‌ సిద్దార్థ వ్యాఖ్యలపై స్పందించారు.

నా కూతురు పతకాలు గెలిచింది..

‘నా కూతురిని ఉద్దేశించి అతడు(హీరో సిద్ధార్థ) అలా వ్యాఖ్యానించడం నిజంగా బాధాకరం. మరి అసలు అతడు దేశం కోసం ఏం చేశాడు. నా కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచింది.. దేశ ప్రతిష్ఠ, గౌరవాలను ఇనుమడింపజేసింది. నా కూతురు ఎంత కష్టపడితే ఈ స్థాయికి చేరుకుందో అందరికీ తెలుసు కాబట్టే.. అందరూ తనకు సపోర్టుగా నిలుస్తున్నారు. ‘ అని సిద్ధార్థ్‌పై మండిపడ్డాడు. ఈ సందర్భంగా తన కూతురుకు మద్దతుగా నిలిచిన జర్నలిస్టులు, క్రీడా ప్రముఖులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

కాగా పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో భద్రతా వైఫల్యం తలెత్తిన నేపథ్యంలో సైనా సోషల్‌ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ‘ప్రధాన మంత్రి భద్రతకే ముప్పు వాటిల్లినపుడు మనం భద్రతగా ఉన్నామని ఎలా చెప్పుకోగలం’ అని సైనా ట్వీట్‌ చేసింది. దీనిపై స్పందించిన సిద్ధార్థ ‘చిన్న కాక్‌తో ఆడుతూ ప్రపంచాన్ని గెలిచినట్లు భావించే ఓ ఛాంపియన్‌ ఇండియాను రక్షించే వాళ్లు ఉన్నారులే’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు.

Also read:

Coronavirus: కరోనా బారిన పడిన టీమిండియా ఆల్‌రౌండర్‌.. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు దూరం..

IPL 2022: ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వివో ఔట్‌.. కొత్త స్పాన్సర్‌ ఎవరంటే..

Shimbu: కోలీవుడ్‌ హీరో శింబుకు అరుదైన గౌరవం.. ఎవరికి అంకితమిచ్చాడంటే..