IPO Scam: వెలుగులోకి నయా స్కామ్.. అధిక రాబడి పేరుతో రూ.1.19 కోట్లు కొట్టేసిన కేటుగాడు

తక్కువ పెట్టుబడితో అధిక రాబడినిస్తామంటూ చేసే మోసాల సంఖ్య కూడా అంతేస్థాయిలో పెరుగింది. ముంబైకి చెందిన 51 ఏళ్ల వ్యక్తికి పెట్టుబడులపై అధిక రాబడి ఇస్తామని చెప్పి రూ.1.19 కోట్లు మోసం చేసినందుకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఇటీవల తెలిపారు.

IPO Scam: వెలుగులోకి నయా స్కామ్.. అధిక రాబడి పేరుతో రూ.1.19 కోట్లు కొట్టేసిన కేటుగాడు
New Scam
Follow us
Srinu

|

Updated on: Feb 24, 2024 | 7:15 PM

పెరుగుతున్న టెక్నాలజీ ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందో? అంతే స్థాయిలో నష్టాన్ని చేకూరుస్తున్నాయి. చాలా మంది ప్రజలు తమ దగ్గర ఉన్న సొమ్ముకు మంచి రాబడి రావాలని కోరుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో అధిక రాబడినిస్తామంటూ చేసే మోసాల సంఖ్య కూడా అంతేస్థాయిలో పెరుగింది. ముంబైకి చెందిన 51 ఏళ్ల వ్యక్తికి పెట్టుబడులపై అధిక రాబడి ఇస్తామని చెప్పి రూ.1.19 కోట్లు మోసం చేసినందుకు ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఇటీవల తెలిపారు. ఈ నేపథ్యంలో మోసగాళ్లు ఎలా మోసం చేశారో? ఓసారి తెలుసుకుందాం. 

వాషి ప్రాంతానికి చెందిన బాధితురాలిని నిందితులు నకిలీ క్యాపిటల్ గెయిన్స్ స్టేట్‌మెంట్‌లు, ట్యాక్స్ డాక్యుమెంట్లతో మోసగించి ప్రముఖ కంపెనీకి చెందిన సైబర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ గజానన్ షేర్లు, ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)లో పెట్టుబడులు పెడతామని మోసగించారు. నిందితుల సూచన మేరకు గతేడాది డిసెంబర్ నుంచి భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాడు. కానీ బాధితుడు వాగ్దానం చేసినట్లుగా రాబడిని పొందలేదు. అలాగే పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరినప్పుడు నిందితుడు అతనికి తప్పించుకునే సమాధానాలు ఇచ్చాడు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో  ముగ్గురు వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇలాంటి మరో ఘటనలో ముంబైకి చెందిన 40 ఏళ్ల మహిళను ఆన్‌లైన్ షేర్ ట్రేడింగ్‌లో రూ.1.92 కోట్ల మోసం చేసినందుకు తొమ్మిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. న్యూ పన్వెల్ ప్రాంతంలో నివాసం ఉంటున్న బాధితురాలిని నిందితులు తన పెట్టుబడులపై అధిక రాబడి వస్తుందని వాగ్దానం చేసి షేర్ల ఆన్‌లైన్ ట్రేడింగ్‌లోకి రప్పించారు. నిందితులు సూచించిన విధంగా డిసెంబర్ 2023 నుంచి ఆమె రూ. 1,92,82,837 మొత్తాన్ని వివిధ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసింది. అయితే వాటిపై ఎలాంటి రాబడి పొందలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి