AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 16వ విడత డబ్బులు వచ్చేది అప్పుడే.. తేదీ ఖరారు!

పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ పీఎం కిసాన్‌ అందుకున్న రైతులు తప్పనిసరిగా eKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేసుకోని రైతులకు ఈ 16వ విడత డబ్బులు అందవని గుర్తించుకోండి. eKYC సేవలను పీఎం కిసాన్ పోర్టల్‌లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌లలో పొందవచోచ్చు. eKYCని అమలు చేయడం..

PM Kisan: రైతులకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ 16వ విడత డబ్బులు వచ్చేది అప్పుడే.. తేదీ ఖరారు!
Pm Kisan
Subhash Goud
|

Updated on: Feb 24, 2024 | 3:43 PM

Share

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. రైతులకు మోడీ ప్రభుత్వం ప్రకటించిన పథకాల్లో పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన స్కీమ్‌ ఒకటి. ఈ పథకం ద్వారా రైతులకు ఏడాదికి రూ.6000 చొప్పున వారికి ఖాతాల్లో జమ చేస్తోంది కేంద్రం. అయితే ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతల్లో రూ.2000 చొప్పున జమ చేస్తోంది. ఇప్పటి వరకు 15వ విడత రైతులు అందుకోగా, ఇప్పుడు 16వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 16వ విడత పీఎం కిసాన్‌ డబ్బులు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోగా, ఇప్పుడు ఆ నిధులు ఎప్పుడు విడుదల అవుతాయోనన్న తేదీ ఖరారైంది. ఈనెల 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఈ 16వ విడత పీఎం కిసాన్‌ నిధులు జమ చేయనున్నారు.

పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఈ పీఎం కిసాన్‌ అందుకున్న రైతులు తప్పనిసరిగా eKYC (ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్) చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేసుకోని రైతులకు ఈ 16వ విడత డబ్బులు అందవని గుర్తించుకోండి. eKYC సేవలను పీఎం కిసాన్ పోర్టల్‌లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌లలో పొందవచోచ్చు. eKYCని అమలు చేయడం వెనుక ఉన్న హేతువు ఏమిటంటే, లక్ష్యంగా చేసుకున్న లబ్ధిదారులు నేరుగా వారి ఆధార్-సీడెడ్ బ్యాంక్ ఖాతాలలో పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలను పొందేలా చేయడం. అలాగే మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించడం.

పీఎం కిసాన్ స్కీమ్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

  •  పీఎం పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి
  • అందులో రైతుల విభాగం (Farmer Cornor)లో నో యువర్ స్టేటస్ (Know Your Status) మీద క్లిక్ చేయండి.
  • మీ రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా (Captcha Code) ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయండి.
  • రీ డైరెక్ట్ అయిన పేజీలో మీ పీఎం కిసాన్ స్టేటస్ వివరాలు కనిపిస్తాయి
  • మీకు ఏమైనా సందేహాలు ఉంటే రైతులు పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నెంబ‌ర్లు 155261 / లేదా 011- 24300606కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా

  • మొదటగా రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/ కి వెళ్లాలి.
  • హోం పేజీలో ఫార్మర్ కార్నర్ లో బెనిఫిషియ‌రీ లిస్ట్‌ (Beneficiary List) మీద క్లిక్‌ చేయాలి.
  • ఓపెన్ అయిన పేజీలో మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామం వివరాలను సెలక్ట్ చేసి ‘గెట్ రిపోర్ట్‌’పై క్లిక్ చేయండి
  • పీఎం కిసాన్ సంబంధించి 15వ విడత ల‌బ్ధిదారుల జాబితా స్క్రీన్ పై కనిపిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..