8th Pay Commission: ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం 8వ వేతన సంఘం తీసుకురానుందా?
ప్రభుత్వం 8వ వేతన సంఘం తీసుకురావాలని ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎనిమిదో వేతన సంఘం రాకతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే 8వ వేతన సంఘం తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది..

ఎన్నికలకు ముందు మోడీ ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని తీసుకువస్తుందా అనేది చాలా మంది ప్రభుత్వ ఉద్యోగుల మదిలో మెదులుతున్న ప్రశ్న. ప్రభుత్వం 8వ వేతన సంఘం తీసుకురావాలని ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఎనిమిదో వేతన సంఘం రాకతో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు అనేక రెట్లు పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు నుండి ఉపశమనం లభిస్తుంది. అయితే 8వ వేతన సంఘం తీసుకొచ్చే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం లేదని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ మోడీ ప్రభుత్వం ఎన్నికల సంవత్సరంలో దీనిని తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగులు భావిస్తున్నారు.
8వ వేతన సంఘం వస్తే ఉద్యోగుల జీతాలు పెంపు
ఎన్నికలకు ముందు 8వ వేతన సంఘం తీసుకువచ్చినట్లయితే ఉద్యోగులకు ఎంతగానో మేలు జరుగనుంది. ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఇదే జరిగితే కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రభుత్వ అధికారుల జీతాలు పెరుగుతాయి. ఉద్యోగుల జీతం, పే స్కేల్, అలవెన్సులు పే కమిషన్ ఆధారంగా నిర్ణయించబడతాయి. ఎనిమిదో వేతన సంఘం రాకతో ఇవన్నీ పెరగనున్నాయి. ఉద్యోగులకు ప్రతి పదేళ్ల తర్వాత పే కమిషన్‌ను అమలు చేస్తారు. ఇప్పటి వరకు 5వ, 6వ, 7వ వేతన సంఘం అమలులోనూ ఇదే పద్ధతి కొనసాగుతోంది.
అన్ని అలవెన్సులు పెరుగుతాయి
8వ వేతన సంఘం రాకతో ఉద్యోగుల బేసిక్ వేతనం, డియర్‌నెస్ అలవెన్స్, ట్రావెల్ అలవెన్స్, హెచ్‌ఆర్‌ఏ తదితరాలన్నీ పెరగనున్నాయి. ప్రాథమిక వేతనం ఆధారంగా డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) నిర్ణయించబడుతుంది.
8వ వేతన కమిషన్‌కు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పింది
ఇటీవల ప్రభుత్వం 8వ వేతన కమిషన్‌కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన ఇచ్చింది. దీనిలో ఆర్థిక కార్యదర్శి టివి సోమనాథన్ మాట్లాడుతూ.. వచ్చే జాతీయ ఎన్నికలలోపు సుమారు 54 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన కమిషన్‌ను రూపొందించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








