IRCTC: ఇక రైళ్లలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ.. ఐఆర్‌సీటీసీ ఒప్పందం.. ఈ 4 స్టేషన్‌లలో ప్రారంభం
భారతదేశం రెండవ అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ Swiggy ఇటీవల లక్షద్వీప్‌లో కూడా తన కార్యకలాపాలను విస్తరించింది. అగట్టి ద్వీపంలో స్విగ్గీ సేవ అందుబాటులో ఉంది. లక్షద్వీప్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించినందుకు స్విగ్గీ రికార్డు సృష్టించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్విగ్గీ డెలివరీ బాయ్‌లు లక్షద్వీప్‌లో వాహనాలను ఉపయోగించరు. ఆహారం సైకిల్ ద్వారా సరఫరా చేస్తారు..
దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అంటే అతి భారతీయ రైల్వే అని చెప్పక తప్పదు. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. దీని కోసం రైల్వే శాఖ కూడా అన్ని రకాల సదుపాయాలను అందిస్తోంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎప్పటికప్పుడు సదుపాయాలను మెరుగు పరుస్తోంది. అయితే రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు నాణ్యమైన ఫుడ్ అందించేందుకు రైల్వే శాఖ చర్యలు చేపడుతోంది. ఐఆర్‌సిటిసి పోర్టల్ ద్వారా రైలు ప్రయాణికులకు ముందస్తుగా బుక్ చేసుకున్న ఆహారాన్ని డెలివరీ చేసేందుకు స్విగ్గితో ఐఆర్‌సిటిసి ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతానికి, బెంగళూరుతో సహా కొన్ని ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో ఇది అమలు చేయబడుతుంది. ఈ సర్వీసు ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. ప్రీ-ఆర్డర్ చేసిన ఆహారాన్ని (ముందస్తు-ఆర్డర్ చేసిన భోజనం) డెలివరీ కోసం Swiggyతో చేతులు కలిపినట్లు IRCTC స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి తన ఫైలింగ్‌లో సమాచారం ఇచ్చింది.
ఐఆర్‌సీటీసీ ఇ-క్యాటరింగ్ పోర్టల్ ద్వారా ప్రీ-బుక్ చేసిన ఆహారాన్ని సరఫరా చేయడానికి, డెలివరీ చేయడానికి బండిల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ (స్విగ్గీ ఫుడ్స్)తో ఐఆర్‌సీటీసీ ఒప్పందం చేసుకుంది. తొలి దశలో నాలుగు రైల్వే స్టేషన్లలో ఈ సర్వీసును ప్రారంభించనున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది.
స్విగ్గీ ద్వారా ఆహారం సరఫరా అయ్యే నాలుగు స్టేషన్లు
- బెంగళూరు
- విజయవాడ
- విశాఖపట్నం
- భువనేశ్వర్
ఈ సేవ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఐఆర్‌సీటీసీ స్పష్టం చేయలేదు.
ఐఆర్‌సీటీసీ షేర్ ధర పెరిగింది:
IRCTC Swiggyతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమారం గురువారం వెల్లడించగా, ఈ ఉదయం స్టాక్ మార్కెట్లో IRCTC షేర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. ఒక రోజు 2.92 శాతంపెరుగుదల కనిపించింది. గత రెండు వారాలుగా పడిపోతున్న దీని స్టాక్ మళ్లీ పుంజుకుంది.
లక్షద్వీప్‌లో స్విగ్గీ; సైకిల్ ద్వారా డెలివరీ
భారతదేశం రెండవ అతిపెద్ద ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ Swiggy ఇటీవల లక్షద్వీప్‌లో కూడా తన కార్యకలాపాలను విస్తరించింది. అగట్టి ద్వీపంలో స్విగ్గీ సేవ అందుబాటులో ఉంది. లక్షద్వీప్‌లో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించినందుకు స్విగ్గీ రికార్డు సృష్టించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, స్విగ్గీ డెలివరీ బాయ్‌లు లక్షద్వీప్‌లో వాహనాలను ఉపయోగించరు. ఆహారం సైకిల్ ద్వారా సరఫరా చేస్తారు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తోంది. అలాగే లక్షద్వీప్‌లో విస్తీర్ణం పెద్దది కానందున ఆహార సరఫరా కోసం సైకిళ్లను ఉపయోగించడం అవసరం.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి