Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ultraviolette bike: సింగిల్ చార్జింగ్ తో 323 కిలోమీటర్ల రేంజ్.. అదరగొడుతున్న ఎలక్ట్రిక్ బైక్

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు తగ్గేదేలా అంటూ దూసుకుపోతున్నాయి. రోజుకో కొత్త వాహనం లేటెస్ట్ ప్రత్యేకతలతో విడుదల అవుతోంది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా స్టైలిష్ లుక్, సామర్థ్యంతో వీటిని తయారు చేస్తున్నారు. గతంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు వచ్చాయి. అనంతరం బైక్ లు విడుదలయ్యాయి. ఇప్పుడు యువత కోసం స్పోర్ట్స్ బైక్ ల తరహాలో అత్యధిక రేంజ్ తో రూపొందిస్తున్నారు. ఈ కోవకు చెందిన అల్ట్రా వయోలెట్ ఎఫ్ 77 సూపర్ స్ట్రీట్ బైక్ ను ఇటీవల విడుదల చేశారు. దీని ప్రత్యేతకలు, ధర, రేంజ్ వివరాలను తెలుసుకుందాం.

Ultraviolette bike: సింగిల్ చార్జింగ్ తో 323 కిలోమీటర్ల రేంజ్.. అదరగొడుతున్న ఎలక్ట్రిక్ బైక్
Ultraviolette F77
Follow us
Srinu

|

Updated on: Feb 01, 2025 | 4:15 PM

అల్ట్రా వయోలెట్ ఎఫ్ 77 సూపర్ స్ట్రీట్ ను బైక్ ను ఇప్పటికే విక్రయిస్తున్న ఎఫ్ 77ను అప్ డేట్ చేసి తయారు చేశారు. సరికొత్త లుక్ తో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీనిలో రెండు రకాల వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ వేరియంట్ రూ.2.99 లక్షలు, రీకాన్ వేరియంట్ రూ.3.99 లక్షలు పలుకుతోంది. ఈ బండి బుక్కింగ్ లు ఫిబ్రవరి ఒకటిన ప్రారంభమయ్యాయి. డెలివరీలు మార్చి నుంచి మొదలవుతాయి. అల్ట్రా వయోలెట్ ఎఫ్ 77 సూపర్ స్ట్రీట్ ను బైక్ ను తయారు చేయడానికి కంపెనీకి ఎనిమిది నెలల సమయం పట్టింది. వినియోగదారుల నుంచి ఫీడ్ బ్యాక్ ను పరిగణనలోకి తీసుకుని పలు మార్పులు చేసింది. ఎఫ్ 77లో క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఉన్న చోట దీనిలో సింగిల్ పీస్ హ్యాండిల్ బార్ ను ఏర్పాటు చేశారు. రైడర్ నిటారుగా ఉండి నడిపేందుకు వీలుగా ఉంటుంది. సూపర్ స్ట్రీట్ బైక్ గతంలోని ఎఫ్ 77 మాదిరిగానే కనిపిస్తుంది. టర్బో రెడ్, ఆఫ్టర్ బర్నర్, ఎల్లో, స్టెల్లార్ వైట్, కాస్మిక్ బ్లాక్ అనే నాలుగు రకాల రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.

అల్ట్రా వయోలెట్ ఎఫ్ 77 స్ట్రీట్ లోని స్టాండర్డ్ వేరియంట్ లో 7.1 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఒక్క సారి చార్జింగ్ చేసకుంటే దాదాపు 211 కిలోమీటర్ల రేంజ్ వస్తుంది. మరో వేరియంట్ అయిన రీకాన్ లో 10.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ అమర్చారు. ఫుల్ చార్జింగ్ తో 323 కిలోమీటర్ల వరకూ పరుగులు తీస్తుంది. గంటకు గరిష్టంగా 155 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయవచ్చు. స్టాండర్ వేరియంట్ నుంచి 36 బీహెచ్ పీ గరిష్ట శక్తి, 90 ఎన్ ఎం గరిష్ట టార్కు విడుదల అవుతుంది. కేవలం 2.9 సెకన్లలో సున్నా నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే 7.8 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగానికి చేరుకుంటుంది. ఇక రీకాన్ వేరియంట్ నుంచి 40 బీహెచ్ పీ, 100 ఎన్ఎం టార్కు విడుదల అవుతుంది. 2.8 సెకన్లలో సున్నా నుంచి 60 కిలోమీటర్లు, 7.7 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగానికి చేరుకుంటుంది.

అల్ట్రా వయోలెట్ ఎఫ్ 77 సూపర్ స్ట్రీట్ మోటారు సైకిల్ కు ఆ విభాగంలో ప్రధాన ప్రత్యర్థులెవ్వరూ లేరు. పెట్రోలుతో నడిచే బైక్ లలో కేటీఎం 390 డ్యూక్, బీఎండబ్ల్యూ జీ 310 ఆర్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 పోటీ పడతాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి