Budget 2025 : మేడమ్ సార్ మేడమ్ అంతే..! సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగంతో రికార్డ్ క్రియేట్ చేసిన నిర్మలా సీతారామన్..
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఇప్పటికే తన పేరుమీద అనేక రికార్డులు సొంతం చేసుకున్నారు. ఆమె భారతదేశపు మొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా గొప్ప గుర్తింపు సాధించారు.. తాజా బడ్జెట్‌తో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డు స్థాయిలో ఎనిమిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించారు. ఆర్థిక మంత్రి సీతారామన్ 2020 సంవత్సరంలో దేశంలోనే అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాన్ని అందించిన రికార్డు సృష్టించారు. ఆమె 2 గంటల 40 నిమిషాల సుదీర్ఘ ప్రసంగం చేశారు.

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సీతారామన్ వరుసగా 8వ సారి దేశ బడ్జెట్‌ను సమర్పించారు. బడ్జెట్ ప్రకటనలో భాగాంగా వివిధ రంగాలలో అనేక ప్రోత్సాహకాలను ప్రకటించారు. ఈ బడ్జెట్‌లో సామాన్యులకు ప్రయోజనం కలిగించే చర్యలు, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, వచ్చే ఏడాదిలో ఏది చౌకగా ఉంటుంది. ఏది ఖరీదైనదిగా మారుతుంది. ప్రధాన రంగాలపై ప్రభుత్వం కేంద్రీకరించిన అభివృద్ధి వివరాలను నిర్మలమ్మ వెల్లడించారు. ఈ సందర్భంగా 1 గంట 17 నిమిషాల నిడివితో అంటే 77 నిమిషాల నిడివితో సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు నిర్మలా సీతారామన్. అత్యధిక బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలా సీతారామన్ పేరిట నమోదైంది. 2020 సంవత్సరంలో 2 గంటల 40 నిమిషాల బడ్జెట్ ప్రసంగం చేశారు. ఇది ఇప్పటి వరకు ఉన్న సుదీర్ఘ ప్రసంగం. ఈ ఎనిమిది బడ్జెట్‌ల సందర్బంగా నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ఎంతసేపు సుదీర్ఘ ప్రసంగం చేశారో తెలుసుకుందాం..
2025 బడ్జెట్‌ను సమర్పిస్తున్నప్పుడు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 గంట 17 నిమిషాల ప్రసంగం చేశారు. అంటే ఆమె 77 నిమిషాలు ప్రసంగించారు. ఆర్థిక మంత్రి 77 నిమిషాల్లో యావత్ దేశప్రజల ముందు బడ్జెట్ 2025ను సమర్పించారు. దీనికి ముందు ఆమె ఎన్ని సుదీర్ఘ ప్రసంగాలు చేశారంటే..
2024 బడ్జెట్: 2024లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 1 గంట 25 నిమిషాల పాటు ప్రసంగించారు.
2024 మధ్యంతర బడ్జెట్: 2024 లో నిర్మల మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఇది ఆమె ఇప్పటివరకు సమర్పించిన అతి తక్కువ బడ్జెట్ ప్రసంగం. సీతారామన్ 56 నిమిషాల పాటు వరుసగా ఆరో బడ్జెట్ ప్రవేశపెట్టారు.
2023 బడ్జెట్: 2023లో నిర్మలా సీతారామన్ 87 నిమిషాల్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.
2022 బడ్జెట్: 2022లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం 92 నిమిషాల పాటు సాగింది.
2021బడ్జెట్: 2021లో నిర్మలా సీతారామన్ పేపర్‌ను ఉపయోగించకుండా తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన 2021 బడ్జెట్ ప్రసంగం 1 గంట 40 నిమిషాలు సాగింది. ఈసారి బడ్జెట్‌ను సమర్పించేందుకు తొలిసారిగా పేపర్‌కు బదులు డిజిటల్ ట్యాబ్లెట్‌ను ఉపయోగించారు.
2020బడ్జెట్: 2020లో నిర్మలా సీతారామన్ రికార్డు సృష్టించారు. బడ్జెట్‌ను సమర్పిస్తూ, భారతదేశ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగం చేశారు. ఈ బడ్జెట్ ప్రసంగం 2 గంటల 41 నిమిషాల పాటు సాగింది.
2019బడ్జెట్: 2019లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలిసారిగా దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన ప్రసంగం 2 గంటల 17 నిమిషాల పాటు సాగింది. ఆర్థిక మంత్రి కనీసం మంచినీళ్లు తాగలేదని చెబుతారు.
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి