Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: 10 రోజులుగా తల్లి మృతదేహంతో ఇద్దరు కూతుళ్లు ఎం చేశారంటే…

ఇద్దరు కూతుళ్ల నుండి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే తమ తల్లి మరణించిన విషయాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు కూతుళ్లు సైతం ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. కానీ ధైర్యం సరిపోక ఆత్మహత్యకు విఫల యత్నం చేశారు. ఒక వెంటనే స్పందించిన పోలీసులు లలిత మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడినుండి ఆమె దహన సంస్కారాలను మున్సిపల్ అధికారులకు అప్పగించారు.

Hyderabad: 10 రోజులుగా తల్లి మృతదేహంతో ఇద్దరు కూతుళ్లు ఎం చేశారంటే...
Mother Dies
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Jyothi Gadda

Updated on: Feb 01, 2025 | 1:07 PM

హైదరాబాదులో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొన్ని కారణాల చేత తల్లి లలిత అకాల మరణం చెందింది. తల్లి దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తోచని ఇద్దరు కూతుళ్లు మృతదేహాన్ని బయటికి తీసుకెళ్లలేక ఇంట్లోనే పెట్టుకుని పది రోజులపాటు గడిపారు. సికింద్రాబాద్ లోని వారాసిగూడ లో ఈ ఘటన చోటుచేసుకుంది. జనవరి 22న లలిత అకాలమరణం చెందింది. 23 ఉదయం ఎంత లేపిన తల్లి కళ్ళు తెరవకపోవడంతో ఇద్దరు కూతుర్లు ఆందోళన చెందారు. అయితే చివరికి తమ తల్లి చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు.

అయితే అప్పటికే ఆర్థిక సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు కూడా వీరిని వెంటాడాయి. తల్లి చనిపోయిన విషయం కనీసం బంధువులకు కూడా చెప్పుకోలేని దయనీయ స్థితిలో ఉన్నారు. తల్లి మృతదేహానికి దహన సంస్కారాలు చేసేందుకు కావలసిన డబ్బులు కూడా తమ వద్ద లేకపోవడంతో ఇంట్లోనే తల్లి మృతదేహాన్ని ఉంచి పది రోజులు గడిపారు. ఇక బాడీ డీకంపోస్ అవుతున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి జరిగిన విషయం చెప్పి సహాయం కోరారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే పోలీసులకు సమాచారం అందించి ఫిర్యాదు చేసేలా ఇద్దరు కూతుళ్లకు సలహా ఇచ్చారు.

ఎమ్మెల్యే నివాసం నుండి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఇద్దరు కూతుర్లు జరిగిన విషయం మొత్తాన్ని పోలీసులకు చెప్పారు. దాంతో పోలీసులు వారాసిగూడలో ఉన్న వారి నివాసం వద్దకు వెళ్లారు. ఇద్దరు కూతుళ్లు చెప్పిన విధంగానే లోపల తల్లి మృతదేహం ఉండటంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. ఇద్దరు కూతుళ్ల నుండి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే తమ తల్లి మరణించిన విషయాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు కూతుళ్లు సైతం ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. కానీ, ధైర్యం సరిపోలేదని చెప్పారు. ఆ ఇద్దరి ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు లలిత మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి ఆమె దహన సంస్కారాల కోసం మున్సిపల్ అధికారులకు అప్పగించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
మంటలు రేపనున్న మార్చినెల.. ఎండలతో జాగ్రత్త జర వీడియో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
గంగానది మధ్యలో వంద మంది యాత్రికులు.. ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
హల్దీ ఫంక్షన్‌లో కోతి హల్‌చల్‌.. ఏం చేసిందో చూడండి
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
92 ఏళ్ల వృద్ధురాలి సాహసం.. శివుడి కోసం.. కాగుతున్న నూనెలో చేతితో
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
అయ్యో.. నీళ్ల కోసం వచ్చి బావిలో పడి.. చివరికి?
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
గోవా కొంపముంచిన ఇడ్లీ సాంబార్‌.. ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు
"గోల్డ్‌ కార్డు'' కావాలా నాయనా..? కండిషన్స్ అప్లయ్‌.!
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
ఐదుగురు మహిళలతో కలిసి అంతరిక్షంలోకి జెఫ్‌ బెజోస్‌ ప్రియురాలు
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
గ్రహశకలం భూమిని ఢీ కొంటే.. నాశనమయ్యే నగరాలు ఏంటో తెలుసా?
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు
తల్లి ప్రేమ రేంజ్ ఇదీ.. కుక్క దాడి నుంచి తల్లి రక్షణ కవచం ఏర్పాటు