Budget 2025 : వినూత్న రీతిలో బడ్జెట్ 2025కి స్వాగతం పలికిన సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్.. అందులోని సందేశం ఏంటంటే..
ఈ ముఖ్యమైన రోజును ఒడిశాకు చెందిన ప్రముఖ చిత్ర కళాకారుడు, సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తన ప్రత్యేకమైన కళ ద్వారా ఈ రోజు బడ్జెట్‌ను స్వాగతించారు. పూరీ బీచ్‌లో 4 టన్నుల ఇసుకను ఉపయోగించి 2025 బడ్జెట్‌ను వర్ణించే అద్భుతమైన కళాఖండాన్ని అతను రూపొందించాడు. దానిపై 'వెల్‌కమ్ యూనియన్ బడ్జెట్ 2025' అంటూ ఇసుకతో అద్భుతంగా లిఖించాడు.

2025-26 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి1 శనివారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా కేంద్రబడ్జెట్ యావత్ దేశప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ ముఖ్యమైన రోజును ఒడిశాకు చెందిన ప్రముఖ చిత్ర కళాకారుడు, సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తన ప్రత్యేకమైన కళ ద్వారా ఈ రోజు బడ్జెట్‌ను స్వాగతించారు. పూరీ బీచ్‌లో 4 టన్నుల ఇసుకను ఉపయోగించి 2025 బడ్జెట్‌ను వర్ణించే అద్భుతమైన కళాఖండాన్ని అతను రూపొందించాడు. దానిపై ‘వెల్‌కమ్ యూనియన్ బడ్జెట్ 2025’ అంటూ ఇసుకతో అద్భుతంగా లిఖించాడు.
భారతదేశానికి చెందిన ప్రఖ్యాత పద్మశ్రీ అవార్డు పొందిన సైకత శిల్పి అయిన పట్నాయక్ ఈ సందర్భంగా వేసిన బడ్జెట్ చిత్రం వెనుక ఓ సందేశం ఉందంటూ తన ఆలోచనను పంచుకున్నారు. అందరూ భారతీయులతో పాటు తాను కూడా యూనియన్ బడ్జెట్ 2025పై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని చెప్పాడు. అందుకే తన కళా నైపుణ్యం ద్వారా ఈ బడ్జెట్‌ను స్వాగతించాలనుకున్నట్టుగా చెప్పారు.
Odisha: Sand artist Sudarsan Pattnaik crafts sand sculpture on Union Budget 2025
Read @ANI Story | https://t.co/LBQF4bahFt#UnionBudget2025 #UnionBudget pic.twitter.com/s9ZufsbLll
— ANI Digital (@ani_digital) February 1, 2025
పట్నాయక్ తన సృజనాత్మకతను ప్రదర్శించడమే కాకుండా, ఈ ముఖ్యమైన ఆర్థిక బడ్జెట్ వైపు దేశం, ప్రపంచం దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నించాడు. ఈ బడ్జెట్ పన్ను చెల్లింపుదారులకు, వ్యాపారాలకు మాత్రమే ముఖ్యమైనది కాదు, దేశ ఆర్థికాభివృద్ధిలో కొత్త మార్గాన్ని తెరవగలదని కూడా నిరూపించవచ్చు అని తెలియజేసే ప్రయత్నం చేశారు పట్నాయక్.
మరిన్ని బడ్జెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి