Watch: జూ నిర్వాకం.. కుక్కలకు రంగు వేసి పులుల్ల ప్రచారం.. మండిపడుతున్న ప్రజలు, పర్యాటకులు..
అయితే, ఈ జూ నిర్వాహకులు ఇలాంటి పని చేయటం ఇదే మొదటి సారి కాదు.. గతంలోనూ ఇలాగే, కుక్కలకు పెయింటింగ్ వేసి పాండాలుగా ప్రచారం చేసింది. అప్పుడు కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు పబ్లిసిటీ కోసం కుక్కలకు పులి రంగు పూశారు. దీనిపై సర్వత్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

చైనాలో ఎప్పుడూ ఏదో ఒక వింత జరుగుతునే ఉంటుంది. అక్కడి ప్రజలు చేసే వింత పనులు, విచిత్ర చేష్టలు, వాతావరణం, ప్రజల జీవన విధానం ఇలా ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. చైనాలోని ఒక జూలో కుక్కలకు పెయింట్ వేసి పులులుగా నమ్మిస్తూ..పర్యాటకులకు టోపీ పెట్టే ప్రయత్నం చేశారు జూ నిర్వాహకులు. అవును, కుక్కలకు పులుల రంగులు వేసి, ప్రచారంలో భాగంగానే ఇలా చేశామని జూ యాజమాన్యం అంగీకరించింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా, వీడియో చూసిన నెటిజన్లు , చైనా ప్రజల నుంచి ఈ జిమ్మిక్కుపై చాలా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని తైజౌలోని ఒక జంతుప్రదర్శనశాల సందర్శకులను చారల పులిగా భావించేలా చౌ చౌ డాగ్‌కు నలుపు, కుంకుమ రంగును పూసింది. ఈ కుక్కల వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారి జూపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వీడియో వైరల్‌గా మారడంతో చేసేది లేక జూ నిర్వాహకులు తాము చేసిన చీటింగ్ విషయాన్ని ఒప్పుకుంది..మేము పబ్లిసిటీ స్టంట్‌లో భాగంగానే కుక్కలను పులుల్ల చిత్రించామని చెప్పారు. కుక్కల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం లేదన్నారు. వాటికి ఎటువంటి హాని చేయలేదని చెప్పారు.
On January 24, 2025, at the “Qinhu Bay Forest Animal Kingdom” in Taizhou, Jiangsu Province, China, the park promoted itself on a Douyin livestream, claiming: “Our tigers are huge and very fierce!” pic.twitter.com/LFoGUm0fWc
— ( ͡ ͡° ͜ ʖ ͡ ͡°) (@eseLSMN) January 27, 2025
అయితే, ఈ జూ నిర్వాహకులు ఇలాంటి పని చేయటం ఇదే మొదటి సారి కాదు.. గతంలోనూ ఇలాగే, కుక్కలకు పెయింటింగ్ వేసి పాండాలుగా ప్రచారం చేసింది. అప్పుడు కూడా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు పబ్లిసిటీ కోసం కుక్కలకు పులి రంగు పూశారు. దీనిపై సర్వత్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. eseLSMN పేరుతో X ఖాతాలో భాగస్వామ్యం చేయబడిన వీడియోలో, జంతుప్రదర్శనశాలలో రెండు పులి లాంటి కుక్కలు కనిపిస్తాయి. జనవరి 27న షేర్ చేసిన ఈ వీడియోపై పెద్ద సంఖ్యలో విమర్శలు, కామెంట్లు వచ్చాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..