AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వావ్‌..ఈ క్యాబ్‌ ఎక్కితే దిగరు.. బిజినెస్‌ క్లాస్‌ ఫ్లైట్‌ ఎక్కినట్లే.. ! ఇక్కడ సదుపాయాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

ప్రయాణంలో వారికి ఉచిత స్నాక్స్, నీరు, వై-ఫై సదుపాయాన్ని అందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఒక వినియోగదారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్న ఆ క్యాబ్‌ డ్రైవర్‌ ఎవరు..? అతను ఎక్కడ ఉంటాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే...

వావ్‌..ఈ క్యాబ్‌ ఎక్కితే దిగరు.. బిజినెస్‌ క్లాస్‌ ఫ్లైట్‌ ఎక్కినట్లే.. ! ఇక్కడ సదుపాయాలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Cab Driver Offers Free Snacks, Wi-Fi
Jyothi Gadda
|

Updated on: Feb 01, 2025 | 5:14 PM

Share

ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లో ఓలా, ఉబర్‌, ర్యాపిడో సౌకర్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే.. ప్రజారవాణా రద్దీ, సమయాపాలన కారణంగా ప్రజలు ఇలాంటి ప్రైవేటు రవాణా మార్గాలను ఆశ్రయిస్తున్నారు. అయితే, ఎవరైనా క్యాబ్‌ బుక్ చేసుకున్నప్పుడు..వారి ఏకైక లక్ష్యం వీలైనంత త్వరగా గమ్యాన్ని చేరుకోవడం. కానీ, ఇక్కడ ఒక క్యాబ్ డ్రైవర్ తన కస్టమర్‌లను అతి త్వరగా గమ్యస్థలానికి చేర్చటంతో పాటు, వారికి ఊహించని సదుపాయాలను కల్పి్స్తున్నాడు. ప్రయాణంలో వారికి ఉచిత స్నాక్స్, నీరు, వై-ఫై సదుపాయాన్ని అందిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోని ఒక వినియోగదారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్న ఆ క్యాబ్‌ డ్రైవర్‌ ఎవరు..? అతను ఎక్కడ ఉంటాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే…

సాధారణంగా విమానాల్లో భోజనం, స్నాక్స్ మొదలుకుని ప్రయాణికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. కానీ, ఇక్క ఒక్క ఇల్లోబ్రూ క్యాబ్ డ్రైవర్ తన ప్రయాణికులకు విమానాల కంటే మెరుగైన క్యాబ్ సర్వీస్‌ను అందిస్తున్నాడు. అవును వారు తమ క్యాబ్‌లలో ప్రయాణించే ప్రయాణీకులకు ఉచిత స్నాక్స్, వాటర్ నుండి Wi-Fi వరకు అన్ని రకాల సౌకర్యాలను అందిస్తారు. ఆ ఫోటో ప్రకారం, కారులో స్నాక్స్, నీరు, వై-ఫై, పెర్ఫ్యూమ్, చేతితో పట్టుకునే ఫ్యాన్‌లు, టిష్యూలు, శానిటైజర్‌లు, యాష్‌ట్రేలు అందుబాటులో ఉన్నాయి.

Found cab facilities better than flights… byu/Fancy-Past-6831 indelhi

ఇవి కూడా చదవండి

మూడు రోజుల క్రితం షేర్ చేసిన ఈ పోస్ట్‌కి పలు కామెంట్స్ వస్తున్నాయి. ఒక వినియోగదారు, దేవుడు ఈ డ్రైవర్‌ను ఆశీర్వదిస్తాడు అంటూ ఒకరు రాయగా, బహుశా విమానంలో కూడా ఇలాంటి సదుపాయం లేకపోవచ్చు అంటూ మరొకరు కామెంట్ రాశారు. మరో వినియోగదారు స్పందిస్తూ.. నేను కూడా ఈ క్యాబ్‌లో ప్రయాణించాను, డ్రైవర్ చాలా మంచి వ్యక్తి’ అని చెప్పాడు. ఈ మంచి పనికి డ్రైవర్‌ను పలువురు అభినందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..