Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Perfetto EV Scooter: మార్కెట్‌లో మరో నయా ఈవీ స్కూటర్ లాంచ్.. ధర ఎంతో తెలుసా..?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ రోజురోజుకూ వృద్ధి చెందుతుంది. దీంతో టాప్ కంపెనీల నుంచి స్టార్టప్ కంపెనీల వరకు తమ ఈవీ వాహనాలను భారత మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ప్రముఖ కంపెనీ బీఎన్‌సీ మోటర్స్ సరికొత్త ఈవీ స్కూటర్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ఆ ఈవీ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

Perfetto EV Scooter: మార్కెట్‌లో మరో నయా ఈవీ స్కూటర్ లాంచ్.. ధర ఎంతో తెలుసా..?
Perfetto Ev Scooter
Follow us
Srinu

|

Updated on: Feb 01, 2025 | 4:00 PM

భారతదేశంలోని ప్రముఖ ఈవీ కంపెనీ బీఎన్‌సీ మోటర్స్ భారతదేశంలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ పెర్ఫెట్టోను రూ.1.13 లక్షల ధరకు లాంచ్ చేసింది. ఈ స్కూటర్ ఈ నెలాఖరు నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండనుంది. బీఎన్‌సీ మోటార్స్ పవర్‌ట్రెయిన్‌ను అభివృద్ధి చేయడానికి జపాన్ కంపెనీ ముసాషితో జతకట్టింది. దీంతో సూపర్ ఫీచర్స్‌తో సరికొత్త స్కూటర్‌ను పరిచయం చేసింది. పెర్ఫెట్టో ఈ-స్కూటర్ నగర ప్రయాణాలకు అనువుగా రూపొందించారు. ఈ స్కూటర్ చేతక్ మాదిరిగానే దాని మెటల్ బాడీతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ స్కూటర్‌ క్లాసిక్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. ఈ స్కూటర్ నాలుగు రంగులలో అందుబాటులో ఉంది. పాంగాంగ్ బ్లూ, నీలగిరి గ్రీన్, టోక్యో రెడ్, వెనెటో వైట్ కొనుగోలుకు సిద్ధంగా ఉంది. 

పెర్ఫెట్టో ఈవీ స్కూటర్‌లో టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుకవైపు సింగిల్-సైడ్ షాక్ అబ్జార్బర్, రెండు చివర్లలో డ్రమ్ బ్రేక్‌లు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి పీచర్లు ఆకట్టకుంటాయి. ఈ స్కూటర్‌లో 750 మిమీ పొడవైన సీటు, మళ్లీ ఆ సీటు కింద 25-లీటర్ స్టోరేజీతో వస్తుంది. పెర్ఫెట్టో సెగ్మెంట్‌లో అతిపెద్ద ఫ్లోర్‌బోర్డ్‌ను కలిగి ఉందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. 

పెర్ఫెట్టో ఈవీ స్కూటర్ బ్యాటరీ ప్యాక్ బీఎన్‌సీ యాజమాన్య ఈట్రోల్ 40 బ్యాటరీ, ఎలక్ట్రిక్ డ్రైవ్‌ ట్రెయిన్‌ను జపాన్‌కు చెందిన ముసాషి అభివృద్ధి చేసింది. ఇది డిఫరెన్షియల్ అసెంబ్లీలు, ట్రాన్స్‌మిషన్ గేర్స్, లింకేజ్, సస్పెన్షన్ వంటి వాటితో ఆకట్టుకుంటుంది. అందువల్ల కచ్చితంగా పెర్ఫెట్టో ఈవీ స్కూటర్ వెర్షన్‌ను బట్టి 160కిమీల పరిధిని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. 3.7 సెకన్లలో 0-40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఈ స్కూటర్ 70 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాసులు కురిపించే స్కీమ్‌.. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటీశ్వరులే..
కాసులు కురిపించే స్కీమ్‌.. ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటీశ్వరులే..
సామాన్యుడి కారు ధరకు రెక్కలు.. రేటు పెంచేసి షాక్ ఇచ్చిన కంపెనీ
సామాన్యుడి కారు ధరకు రెక్కలు.. రేటు పెంచేసి షాక్ ఇచ్చిన కంపెనీ
సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా లోన్‌ పొందండి!
సిబిల్ స్కోర్‌తో సంబంధం లేకుండా లోన్‌ పొందండి!
చరణ్ సరసన క్రేజీ బ్యూటీ.. సుకుమార్ ప్లానింగ్ వేరెలెవల్..
చరణ్ సరసన క్రేజీ బ్యూటీ.. సుకుమార్ ప్లానింగ్ వేరెలెవల్..
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రక్తాలు(చెమట) చింధిస్తున్న టీం ఇండియా!
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రక్తాలు(చెమట) చింధిస్తున్న టీం ఇండియా!
అర్ధరాత్రి నడిరోడ్డుపై లగ్జరీ కారు బీభత్సం.. ఏం జరిగిందంటే?
అర్ధరాత్రి నడిరోడ్డుపై లగ్జరీ కారు బీభత్సం.. ఏం జరిగిందంటే?
'కో స్టార్‌తో ప్రేమ? ఆ ఒక్క పోస్ట్‌ తో చిక్కుల్లో హీరోయిన్
'కో స్టార్‌తో ప్రేమ? ఆ ఒక్క పోస్ట్‌ తో చిక్కుల్లో హీరోయిన్
BSNL 90 రోజుల పాటు చౌకైన ప్లాన్‌.. ప్రైవేట్‌ కంపెనీలకు ధీటుగా..
BSNL 90 రోజుల పాటు చౌకైన ప్లాన్‌.. ప్రైవేట్‌ కంపెనీలకు ధీటుగా..
మద్యం తాగితేనే ఫ్యాటీ లివర్ వస్తుందనుకుంటే పొరబడినట్లే..
మద్యం తాగితేనే ఫ్యాటీ లివర్ వస్తుందనుకుంటే పొరబడినట్లే..
ఇక గరళ కాలుష్యం నుంచి యమునాకు విముక్తి..!
ఇక గరళ కాలుష్యం నుంచి యమునాకు విముక్తి..!