నేడే ‘వైఎప్సార్ చేయూత’ : వారి ఖాతాల్లోని నేరుగా రూ.18,750

నేడే 'వైఎప్సార్ చేయూత' : వారి ఖాతాల్లోని నేరుగా రూ.18,750

అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో వెన‌క్కి చూడ‌కుండా దూసుకుపోతున్న‌..ఏపీ సీఎం జ‌గ‌న్ నేడు మ‌రో సంచ‌ల‌న ప‌థ‌కాన్ని ప్రారంభించేందుకు సిద్ధమ‌య్యారు.

Ram Naramaneni

|

Aug 12, 2020 | 9:38 AM

Jagan to launch YSR Cheyutha today : అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి సంక్షేమ ప‌థ‌కాల విష‌యంలో వెన‌క్కి చూడ‌కుండా దూసుకుపోతున్న‌..ఏపీ సీఎం జ‌గ‌న్ నేడు మ‌రో సంచ‌ల‌న ప‌థ‌కాన్ని ప్రారంభించేందుకు సిద్ధమ‌య్యారు. నేడు వైఎప్సార్ చేయూత స్కీమ్‌ను ముఖ్య‌మంత్రి ప్రారంభించనున్నారు. కోవిడ్ నేప‌థ్యంలో సీఎం క్యాంపు ఆఫీసులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకాన్ని లాంఛ‌నంగా స్టార్ట్ చేయ‌నున్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం రూ.18,750 చొప్పున నాలుగేళ్ల కాలంలో రూ. 75,000 లను మహిళలకు ఉచితంగా గ‌వ‌ర్న‌మెంట్ అందించనుంది. ఈ క్ర‌మంలో అర్హ‌త ఉన్న‌ 25 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లోకి నేడు డబ్బులు జమ కానున్నాయి. ఈ చేయూత స్కీమ్ 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో అర్హత ఉన్న మహిళలకు వర్తిస్తుంది.

మహిళల‌కు ఆర్థిక చేదోడు, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి స‌హకారం అందించేలా ఈ పథకాన్ని రూపొందించారు. గ‌వ‌ర్న‌మెంట్ ఇస్తున్న డబ్బుకు మూడు నాలుగు రెట్లు వివిధ స్కీమ్స్, బ్యాంకుల ద్వారా లబ్ధిదారులైన మహిళలకు అందించి, ప‌లు‌ కంపెనీలు అందించే గ్రామీణ‌ వ్యాపార అవ‌కాశాల‌తో వారి జీవనోపాథి మార్గాలను పెంచాలనే టార్గెట్‌ పెట్టుకున్నారు. పశుపోషణ, హస్తకళలు, చిరు వ్యాపారాలు, వ్యవసాయం, ఉద్యానవనం, చేనేత వంటి రంగాల్లో ఉన్న మహిళల ఆర్థిక ప్రగతికి ఈ చర్యలు తోడ్పాటునందించేలా జ‌గ‌న్ స‌ర్కార్ చర్యలు తీసుకుంటోంది.

Also Read : “12 శాతం వ‌డ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జీవోలు ర‌ద్దు”

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu