బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం..
ఓ ప్రయివేటు బస్సులో చెలరేగిన మంటలతో.. ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గా జిల్లా హిరియూరు వద్ద చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి విజయ్‌పుర వెళ్తున్న ప్రయివేటు బస్సులో ఆకస్మికంగా మంటలు అంటుకున్నాయి.
ఓ ప్రయివేటు బస్సులో చెలరేగిన మంటలతో.. ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటన కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గా జిల్లా హిరియూరు వద్ద చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున బెంగళూరు నుంచి విజయ్‌పుర వెళ్తున్న ప్రయివేటు బస్సులో ఆకస్మికంగా మంటలు అంటుకున్నాయి. దీంతో ఈ మంటల్లో చిక్కుకుని ఐదుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఒక మహిళ ఉన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. పలువురు అగ్ని ప్రమాదం నుంచి బయటపడగా… ఐదురుగు మాత్రం మంటల నుంచి బయటకు రాలేక మృతి చెందారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులంతా నిద్ర మత్తులో ఉన్నారు. ఇక ఈ ఘోర ప్రమాదానికి కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.