తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం (11వ తేదీన) 1,897 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం

తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 12, 2020 | 9:23 AM

Coronavirus In Telangana: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం (11వ తేదీన) 1,897 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 84,544కు చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 654కు చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,65,847 కరోనా టెస్టులు చేశారు. నిన్న ఒక్క రోజే 22,972 టెస్టులు చేశారు. జిహెచ్ఎంసిలో నిన్న 479 కేసులు నమోదయ్యాయి. దీంతో జిహెచ్ఎంసిలో మొత్తం కేసుల సంఖ్య43,858కు చేరుకుంది. 22,596 మంది చికిత్స పొందుతుండగా ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన వారి సంఖ్య 61,294కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 1920 మంది డిశ్చార్చి అయ్యారు.