ఆగస్టు 16 నుంచి వైష్ణోదేవి యాత్ర.. ఆంక్షలతో..!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో సుమారుగా 90 రోజులు దేవాలయాలు మూతబడ్డాయి. ఈ క్రమంలో తాత్కాలికంగా నిలిపివేసిన శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర

ఆగస్టు 16 నుంచి వైష్ణోదేవి యాత్ర..  ఆంక్షలతో..!
Follow us

| Edited By:

Updated on: Aug 12, 2020 | 10:04 AM

Vaishno Devi Yatra: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా లాక్ డౌన్ విధించడంతో సుమారుగా 90 రోజులు దేవాలయాలు మూతబడ్డాయి. ఈ క్రమంలో తాత్కాలికంగా నిలిపివేసిన శ్రీమాతా వైష్ణోదేవి యాత్ర దాదాపు నాలుగు నెలల తర్వాత తిరిగి ప్రారంభిస్తున్నట్లు వైష్ణోదేవి దేవస్థానం ప్రకటించింది. స్వాతంత్ర దినోత్సవ వేడుకల తర్వాతి రోజు 16వ తేదీ నుంచి కేంద్ర భూభాగంలోని మతపరమైన ప్రదేశాలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కరోనా వ్యాప్తి నిరోధించడానికి.. ఆంక్షలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని ఆలయ బోర్డు సీనియర్‌ అధికారి తెలిపారు. గుడి పరిసర ప్రాంతాల్లో, కత్రా పట్టణంలో కూడా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించినట్లు వారు తెలిపారు. సంజీచాత్, కత్రా లోని రెండు హెలీప్యాడ్‌ల వద్ద సామాజిక దూరం పాటించేలా సర్కిళ్లు ఏర్పాటు చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 18 నుంచి వైష్ణోదేవి తీర్థయాత్ర తాత్కాలికంగా నిలిపివేశారు. తర్వాత, జూన్ 8 నుంచి మతపరమైన ప్రదేశాలను తిరిగి తెరవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ కొవిడ్‌-19 కేసులు అకస్మాత్తుగా పెరగడంతో మళ్లీ ఆలయాన్ని మూసివేశారు.

Also Read: తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు.. 9మంది మృతి!