సుశాంత్ కేసులో ఆ ఐదుగురుపై నిఘా పెట్టిన సీబీఐ

సుశాంత్ కేసులో ఆ ఐదుగురుపై నిఘా పెట్టిన సీబీఐ

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం కేసు విచారణలో దూకుడు పెంచింది సీబీఐ. ఈ క్రమంలో ఐదుగురు ముఖ్య‌మైన‌ సాక్షులను గుర్తించింది.

Ram Naramaneni

|

Aug 12, 2020 | 8:39 AM

Sushant Singh Rajput death case :బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్​పుత్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం కేసు విచారణలో దూకుడు పెంచింది సీబీఐ. ఈ క్రమంలో ఐదుగురు ముఖ్య‌మైన‌ సాక్షులను గుర్తించింది. ఇందులో సుశాంత్ గ‌ర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి, ఫ్లాట్​లోనే ఉండే అత‌ని ఫ్రెండ్‌ సిద్ధార్థ్ పితాని, సుశాంత్ సోదరి మీతూ సింగ్, ఫ్లాట్ మేనేజర్ శామ్యూల్ మిరండాతో పాటు మరో వ్యక్తిపై నిఘా పెంచింది. వీరందరూ సుశాంత్​ మ‌ర‌ణించిన‌ రోజు అక్కడే ఉన్నారు. పోలీసుల కంటే ముందుగానే వీరు ఘటనా స్థలంలో తార‌స‌ప‌డ్డారు. అలాగే పోలీసులు స్పాట్‌కు చేరుకోక‌ముందు డెడ్‌బాడీని ఎందుకు కిందకు దించారనే విషయంపై స్ప‌ష్ట‌త‌ కోసం వీరి నుంచి సమాచారం సేకరించే పనిలో పడింది సీబీఐ.

ఈ కేసు విషయంలో మొత్తం 56 మందికి సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ప్రజంట్ ఈ కేసును అత్యున్న‌త న్యాయ‌స్థానం విచారిస్తోంది. తన కుమారుడి మ‌ర‌ణం విష‌యంలో న్యాయం జరగాలని కేకే సింగ్​ బిహార్ రాజధాని పాట్నా పీఎస్‌లో ఫిర్యాదు చేవారు. రియా చక్రవర్తి పాత్ర‌పై ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు. దీనిపై ముంబై పోలీసుల నుంచి సమాచారం సేకరించారు పాట్నా పోలీసులు. అలాగే ఈ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం కేసును సమర్థవంతంగా నిర్వహించేందుకు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ కేసును సీబీఐకి అప్పగించాలని గ‌తంలో కేంద్రాన్ని కోరారు. అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ కేంద్రం ఆగస్టు 6న ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అలాగే రియా చక్రవర్తి ఫ్యామిలీ, సుశాంత్ మేనేజర్ శ్రుతి మోదీ, అతడి ఫ్రెండ్ సిద్ధార్థ్ పితానిపై ఈడీ విచారణ కొనసాగుతోంది. మనీ ల్యాండరింగ్ విషయమై వీరిని ప్రశ్నిస్తోంది ఈడీ.

Also Read : “12 శాతం వ‌డ్డీతో ఆ జీతాలు చెల్లించండి : ఏపీ గ‌వ‌ర్న‌మెంట్ జీవోలు ర‌ద్దు”

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu