అమీర్ సినిమా ఇక‌ వచ్చే ఏడాదికే !

అమీర్ సినిమా ఇక‌ వచ్చే ఏడాదికే !

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజాగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. అమీర్ ఖాన్ స‌ర‌స‌న క‌రీనా క‌పూర్ న‌టిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో వాయిదా పడింది.

Ram Naramaneni

|

Aug 12, 2020 | 12:33 PM

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తాజాగా న‌టిస్తోన్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’. అమీర్ ఖాన్ స‌ర‌స‌న క‌రీనా క‌పూర్ న‌టిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో వాయిదా పడింది. హాలీవుడ్ ఫిల్మ్ ఫారెస్ట్ గంప్ రీమేక్‌గా తెరకెక్కుతోంది ఈ చిత్రం. కాగా ఈ మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చిం చిత్ర యూనిట్.

‘లాక్ సింగ్ చడ్డా’ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్‌కు విడుద‌ల‌ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. 25 డిసెంబ‌ర్, 2021న సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ట్లు ప్రముఖ సినీ విమ‌ర్శ‌కుడు, ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, వయాకం 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. విజయ్ సేతుపతి కీలక పాత్రలో క‌నిపించ‌నున్నారు. అద్వైత్ చందన్ ద‌ర్వ‌క‌త్వంలో వస్తున్న ఈ కామెడీ డ్రామాను ముందుగా ఈ ఏడాది క్రిస్మస్‌కు విడుద‌ల‌ చేయాలనుకున్నా.. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో వచ్చే ఏడాది క్రిస్మస్‌కు వాయిదా పడింది. గ‌త ఏడాది త‌న పుట్టిన‌రోజున ఈ చిత్రం చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు అమిర్.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu