మరో ఛాలెంజింగ్ రోల్‌లో స్టార్ హీరోయిన్ నయన్?
మరో ఛాలెంజింగ్ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతోంది స్టార్ హీరోయిన్ నయనతార. ఇప్పటికే విజయ్ సేతుపతి, నయన్ కలిసి చేసిన 'నేనే రౌడీ' అని సినిమాలో వినికిడి లోపం ఉన్న పాత్రలో నటించి అదరగొట్టింది. ఇప్పుడు మళ్లీ తన లవర్ విఘ్నేష్ శివన్ కోసం అంగవైకల్యం ఉన్న పాత్రలో నటించడానికి..
మరో ఛాలెంజింగ్ పాత్రలో నటించేందుకు సిద్ధమవుతోంది స్టార్ హీరోయిన్ నయనతార. ఇప్పటికే విజయ్ సేతుపతి, నయన్ కలిసి చేసిన ‘నేనే రౌడీ’ అని సినిమాలో వినికిడి లోపం ఉన్న పాత్రలో నటించి అదరగొట్టింది. ఇప్పుడు మళ్లీ తన లవర్ విఘ్నేష్ శివన్ కోసం అంగవైకల్యం ఉన్న పాత్రలో నటించడానికి సిద్ధమయిందట నయనతార.
నయనతార గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. విక్టరీ వెంకటేష్, వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన ‘లక్ష్మీ’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నయన్.. ఆ తరువాత వరుస పెట్టి తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన సినిమాలు చేసి ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యింది. అంతేకాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం నయనతార ‘నేత్రికాన్’, ‘మూకుతి అమ్మన్’ సినిమాలతో పాటు రజనీకాంత్ సరసన ‘అన్నాత్తే’ చిత్రంల్లో నటించాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగులకు బ్రేక్ పడింది
ఇప్పుడు వీటితో పాటు ‘కాతువాకుల రెండు కాదల్’ అనే చిత్రంలోనూ నటించబోతుంది నయనతార. ఈ చిత్రానికి నయనతార లవర్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫిల్మ్‌లో నయన్ అంధురాలిగా కనిపించబోతుందట. మరి ఈ సినిమా అమ్మడికి ఎలాంటి గుర్తింపుని తెచ్చిపెడుతుందో చూడాలి.
Read More:
బ్రేకింగ్ః మాజీ మంత్రి ఖలీల్ బాషా కన్నుమూత
రేణు దేశాయ్ సంచలన నిర్ణయం.. లగ్జరీ కార్లు అమ్మేసి!
మరింత క్షీణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
క్షీణించిన ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం! మరో ఆస్పత్రికి తరలింపు