Astrology: ఆ రాశులకు అరుదైన విపరీత రాజయోగాలు.. ఇందులో మీ రాశి ఉందా..?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, 6, 8, 12 స్థానాల అధిపతుల స్థానాల మార్పు వల్ల అరుదైన విపరీత రాజయోగం ఏర్పడుతుంది. వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం రాశుల వారికి ఈ యోగం ప్రస్తుతం ఏర్పడింది. ఇది ఉద్యోగంలో అధికారం, ధనవృద్ధి, విజయం, మంచి అవకాశాలను తెస్తుంది. ఈ రాశుల వారికి వృత్తి, వ్యాపారాల్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది.

Vipareeta Raja Yoga 2025
జ్యోతిష శాస్త్రంలో విపరీత రాజయోగానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. జాతకంలో గానీ, గ్రహ సంచారంలో గానీ 6, 8, 12 స్థానాల అధిపతులు ఒకరి స్థానంలో మరొకరు ఉన్నా లేక ఎవరి స్థానాల్లో వారున్నా విపరీత రాజయోగం పడుతుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడం, వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరగడం, అనేక విధాలుగా ఆదాయం వృద్ది చెందడం, ఎక్కువగా శుభ వార్తలు వినడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, మనసులోని కోరికలు నెరవేరడం, జీవనశైలి మెరుగుపడడం వంటివి ఈ విపరీత రాజయోగం కిందకు వస్తాయి. ప్రస్తుతం గోచారం ప్రకారం వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీన రాశులకు ఈ యోగం పడుతోంది.
- వృషభం: ఈ రాశికి షష్టాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో ఉన్నందువల్ల ఈ నెల 26 వరకు ఈ రాశి వారికి విపరీత రాజయోగం కలిగింది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. జీతభత్యాలు బాగా పెరుగుతాయి. విలాస జీవితం అలవడుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఊహించని విధంగా సిరిసంపదలు కలుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయం కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
- కర్కాటకం: ఈ రాశికి షష్ట స్థానాధిపతి అయిన గురువు 12వ స్థానంలో సంచారం వల్ల విపరీత రాజయోగం ఏర్పడింది. ఇది వచ్చే ఏడాది జూన్ 2 వరకూ కొనసాగుతుంది. దీనివల్ల వృత్తి, ఉద్యోగాల్లో భారీ జీతభత్యాలతో కూడిన అధికార యోగం పడుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరిగి విదేశీ సంస్థల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగులకు అనేక అవకాశాలు అంది వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లపై పైచేయి సాధిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభాలనిస్తాయి.
- సింహం: ఈ రాశికి ఆరవ స్థానాధిపతి అయిన శనీశ్వరుడు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి రెండున్నరేళ్ల వరకు విపరీత రాజయోగం కలిగింది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. శీఘ్ర పురోగతి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. అనేక విధా లుగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందు తుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. గృహ యోగం కలుగుతుంది.
- వృశ్చికం: ఈ రాశికి అష్టమాధిపతి అయిన బుధుడు అష్టమంలోనే సంచారం చేస్తున్నందువల్ల మరో నెల రోజుల పాటు ఈ రాశివారికి విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల జీవితం ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. సర్వత్రా మాట చెల్లుబాటు అవుతుంది. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశముంది. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి.
- మకరం: ఈ రాశికి షష్టాధిపతి అయిన బుధుడు షష్టంలోనే ఉండడం, వ్యయాధిపతి గురువు కూడా షష్టం లోనే సంచారం చేయడం వల్ల విపరీత రాజయోగం కలిగింది. మరో ఏడాది వరకు ఈ రాశివారికి ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. అనేక విధాలుగా ధన లాభాలు కలుగుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. విదేశీయానానికి అవకాశాలు లభిస్తాయి.
- మీనం: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన శని 12వ స్థానంలోనే ఉన్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. రెండున్నరేళ్లు కొనసాగే ఈ రాజయోగం ఉద్యోగంలో ఒకటికి రెండుసార్లు పదోన్నతులు లభిస్తాయి. అంచనాలకు మించి వేతనాలు పెరుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లడం జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ఇవి కూడా చదవండి