Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (June 11, 2025): మేష రాశి వారు అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: ఆ రాశికి చెందిన నిరుద్యోగులకు ఉద్యోగ యోగం.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Horoscope Today 11 June 2025
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 11, 2025 | 5:31 AM

దిన ఫలాలు (జూన్ 11, 2025): మేష రాశి వారు అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన ఉద్యోగులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతారు. తలపెట్టిన ప్రతి పనినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు. కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులకు ఆఫర్లు అందుతాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఈ రాశివారికి ఈ రోజంతా బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు బాగా రాణిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్ని సజావుగా చక్కబెడతారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండదు. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగులకు శ్రమకు తగ్గ ప్రతిఫలం అందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనుల్లో మిత్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆస్తి వివాదాల్లో రాజీ మార్గాలను అనుసరిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. ముఖ్యంగా గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారు మరింత మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం ఉంది. ముఖ్య మైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటుండకపోవచ్చు. తలపెట్టిన ప్రతి పనీ పూర్తవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల సహకారంతో బాధ్యతల్ని పూర్తి చేస్తారు. పిల్లలు చదువులో పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక పరిస్థితి కొద్దిగా అనుకూలంగానే ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయక పోవడం మంచిది. ఒకరిద్దరు బంధుమిత్రులకు సహాయం చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వ్యాపార పరిస్థితులు బాగా అనుకూలంగా సాగిపోతాయి. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులతో అపార్థాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. లావాదేవీలు, కార్యకలాపాల్లో కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగి పోతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక సమస్యల విషయంలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. హోదా లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడికి లోటుండకపోవచ్చు. పెండింగ్ పనులు, వ్యవహారాలన్నీ కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఆదాయం బాగానే పెరుగుతుంది. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం పొందుతారు. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో లాభాలు పొందుతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన దాని కంటే ఎక్కువ రాబడి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు బాగా అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం చాలా మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసు కోవడం మంచిది. వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాభవం పెరుగుతుంది. అధికారుల సహాయ సహకారాలుంటాయి. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలం ఉంటుంది. ఉద్యోగులకు సాఫీగా సాగిపోతుంది. అధికారుల సహాయ సహకారాలుంటాయి. ఆర్థిక వ్యవహారాల్లో కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కానీ, ఒక పట్టాన చేతిలో డబ్బు నిలవదు. మొండి బాకీలు వసూలవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక, ఆస్తి వ్యవహారాల్లో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆర్థిక విషయాల్లో ఇతరులకు మాట ఇవ్వకపోవడం చాలా మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి సాధిస్తారు. నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పిల్లల చదువులకు సంబంధించి సానుకూల సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.