- Telugu News Photo Gallery Spiritual photos Telugu Astrology: Powerful Raj Yogas from Planetary Transit of Moon
Raja Yoga: ఈ రాశులకు చంద్ర రాజయోగం.. మనసులో కోరికలు తీరుతాయ్..!
Moon Transit: జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహ సంచారంలో చంద్రుడి మీద గురు, శుక్ర, బుధుల దృష్టి పడినప్పుడు తప్పకుండా రాజయోగాలు కలుగుతాయి. చంద్రుడు రాజయోగకారక గ్రహం. మనసులోని కోరికలు తీరాలన్నా, మానసిక ప్రశాంతత కలగాలన్నా చంద్రుడి మీద శుభగ్రహాల దృష్టి పడడం గానీ, చంద్రుడు శుభగ్రహాలతో కలిసి ఉండడం గానీ జరగాలి. ఈ నెల(జూన్) 7, 8, 9 తేదీల్లో తులా రాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి మీద బుధుడితో కలిసి ఉన్న గురువు దృష్టి, సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న శుక్రుడి దృష్టి పడుతోంది. దీనివల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, మీన రాశుల వారికి రాజయోగాలు కలిగే అవకాశం ఉంది.
TV9 Telugu Digital Desk | Edited By: Janardhan Veluru
Updated on: Jun 07, 2025 | 5:04 PM

మేషం: ఈ రాశికి సప్తమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి మీద శుభ గ్రహాల దృష్టి పడినందువల్ల ఈ రాశివారి మనసులోని కోరికల్లో కొన్ని తప్పకుండా నెరవేరుతాయి. ఈ రాశివారు ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేసే ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో రాజయోగాలు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది.

మిథునం: ఈ రాశికి పంచమ స్థానంలో ఉన్న చంద్రుడి మీద శుభ గ్రహాల దృష్టి పడినందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి లాభాలు కలుగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. మదుపులు, పెట్టుబడుల వల్ల అత్యధికంగా ఆదాయం పొందుతారు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది. జీవన శైలి బాగా మారిపోయే అవకాశం ఉంది.

కర్కాటకం: చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న రాశినాథుడు చంద్రుడి మీద శుభ గ్రహాల దృష్టి పడడం వల్ల విశేష రాజయోగం కలుగుతుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. పని ఒత్తిడి నుంచి మానసిక ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా ఉన్నత పదవులు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది. మాతృ సౌఖ్యం కలుగుతుంది. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. అనుకోకుండా ఆస్తి లాభం కలుగుతుంది.

తుల: ఈ రాశిలో ఉన్న చంద్రుడిని గురు, శుక్ర, బుధులు వీక్షించడం వల్ల ఈ రాశివారు అనేక విధాలుగా వృద్ధిలోకి రావడం జరుగుతుంది. కొద్దిపాటి ప్రయత్నంతో వీరి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో తప్పకుండా రాజయోగాలు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న ఉద్యోగులు, నిరుద్యోగుల కల నెరవేరుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరుగుతాయి. తండ్రి నుంచి వారసత్వ సంపద లభిస్తుంది. ఆరోగ్య లాభం కలుగుతుంది.

ధనుస్సు: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న చంద్రుడిని రాశ్యధిపతి గురువుతో సహా శుభ గ్రహాలన్నీ వీక్షించడం వల్ల విపరీత రాజయోగం కలుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరిగి ముఖ్యమైన వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతనలో కూడా పురోగతి చెందుతారు. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఇతర దేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతాధికార పదవి లభిస్తుంది. ఆస్తి లాభం కలుగుతుంది.

మీనం: ఈ రాశికి అష్టమ స్థానంలో ఉన్న చంద్రుడి మీద రాశ్యధిపతి గురువుతో సహా శుభ గ్రహాల దృష్టి పడడం అత్యంత శుభదాయకం. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. వారసత్వ సంపద లభిస్తుంది. ఆస్తి సమస్యలు పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. రావలసిన సొమ్ము ఎట్టకేలకు చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి కనక వర్షం కురిపిస్తాయి. విదేశీ సంపాదన అనుభవించే యోగం పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.



















