Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lucky Zodiac Signs: మిథున రాశిలో కీలక గ్రహాలు.. ఆ రాశులకు ఊహించని అదృష్టం..!

ఈ నెల (జూన్)15 నుంచి 31 వరకు మిథున రాశిలో ప్రధాన గ్రహాల సంచారం కాస్తంత ఎక్కువగా ఉన్నందువల్ల కొన్ని రాశుల వారి జీవితంలో వేగంగా, చురుకుగా మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నెల 15 నుంచి మిథున రాశిలో రవి, బుధ, గురువులు యుతి చెందడం వల్ల కొన్ని రాశులకు శుభ యోగాలు ఎక్కువగా కలుగుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. ఈ పదిహేను రోజుల కాలంలో వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనూ రాశుల వారి జీవితాల్లో ముఖ్యమైన సంఘటనలు, శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 10, 2025 | 6:13 PM

వృషభం: ఈ రాశికి ధన స్థానంలో రవి, బుధ, గురువుల సంచారం వల్ల ఆదాయ ప్రయత్నాల్లో పూర్తిగా నిమగ్నమయ్యే అవకాశం ఉంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, మదుపులు, పెట్టుబడుల వల్ల బాగా లాభాలు కలుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభ వార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. ఉద్యోగ జీవితం వైభవంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మాటకు విలువ పెరుగుతుంది.

1 / 6
మిథునం: ఈ రాశిలో రాశ్యధిపతి బుధుడు, సప్తమాధిపతి గురువు, తృతీయ స్థానాధిపతి రవి కలవడం వల్ల కొద్ది ప్రయత్నంతో అనేక శుభ యోగాలు కలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అంచనాలకు మించిన పురోగతితో పాటు, సంపాదన బాగా పెరుగుతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లలో విశేష లాభాలు పొందుతారు.

2 / 6
సింహం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి రవితో సహా మూడు గ్రహాలు కలవడం వల్ల అష్టమ శని దోషం దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందడంతో పాటు షేర్లు, ఆర్థిక లావాదేవీల్లో బాగా లాభాలు కలుగుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు.

3 / 6
కన్య: ఈ రాశికి దశమంలో రాశ్యధిపతి బుధుడితో రవి, గురువులు కలవడం వల్ల ఉద్యోగంలో తప్ప కుండా పదోన్నతులు కలుగుతాయి. జీతభత్యాలు అంచనాలను మించి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు రాబడి విపరీతంగా పెరుగుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. పలుకుబడి బాగా విస్తరిస్తుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలగవచ్చు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది.

4 / 6
తుల: ఈ రాశికి దశమంలో గురు, రవి, బుధులు కలవడం వల్ల ఒక పదిహేను రోజుల పాటు జీవితం సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ తేలికగా పూర్తవుతాయి. ప్రతి ప్రయత్నమూ కలిసి వస్తుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి, లాభాలు బాగా వృద్ధి చెందుతాయి.

5 / 6
ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువుతో బుధ, రవి గ్రహాలు కలవడం వల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. దాంపత్యంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి.

6 / 6
Follow us
స్టార్ హీరోలు కూడా ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే..

ఇట్స్ అమేజింగ్.. మెట్లు ఎక్కడం వల్ల క్రియేటివ్‌గా ఆలోచిస్తారట..

ఒకే కుటుంబంలో 12మంది పిల్లలకు తల్లికి వందనం.. ఎంత డబ్బు వచ్చిందంట

ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై టర్కీ రియాక్షన్‌.. ఏమన్నాదంటే?

దేశీయ క్రికెట్‌ రూపు మార్చిన BCCI.. కొత్త నిబంధనలతో మరింత కొత్తగా

తిరువనంతపురంలో యూకే ఫైటర్ జెట్ అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే..

ఐపీఎల్‌లో అట్టర్ ఫ్లాప్.. కట్‌చేస్తే.. 38 బంతుల్లో 11 సిక్సర్లతో

ఆ స్టార్ హీరోతో ప్రేమ.. కానీ ఇప్పటికీ సింగిల్‌గానే..

హెలికాప్టర్ పైలట్ నెల జీతం ఎంత ఉంటుందో తెలుసా..?

NEET UG 2025 స్కోర్ తారుమారుకు స్కెచ్.. ఒక్కొక్కరికి రూ. 90లక్షలు