Astrology: ఆ రాశులకు నీచభంగ రాజయోగం.. వారి జీవితాల్లో అనేక శుభ పరిణామాలు పక్కా..!

శుక్ర గ్రహం మీన రాశిలో ఉచ్ఛ స్థితిలోనూ, కన్యారాశిలో నీచ స్థితిలోనూ ఉంటాడు. ఈ నెల 25 నుంచి కన్యారాశిలో ప్రవేశించి, సెప్టెంబర్ 18 వరకూ అదే రాశిలో కొనసాగబోతున్న శుక్రుడు సాధారణంగా నీచ స్థితి ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది కానీ, శుక్రుడికి చెందిన వృషభ రాశి నుంచి గురువు శుక్ర గ్రహాన్ని వీక్షించడం వల్ల ఈ గ్రహానికి నీచత్వం తొలగిపోయే అవకాశం ఉంది.

Astrology: ఆ రాశులకు నీచభంగ రాజయోగం.. వారి జీవితాల్లో అనేక శుభ పరిణామాలు పక్కా..!
Neechabanga Raja Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 22, 2024 | 7:02 PM

శుక్ర గ్రహం మీన రాశిలో ఉచ్ఛ స్థితిలోనూ, కన్యారాశిలో నీచ స్థితిలోనూ ఉంటాడు. ఈ నెల 25 నుంచి కన్యారాశిలో ప్రవేశించి, సెప్టెంబర్ 18 వరకూ అదే రాశిలో కొనసాగబోతున్న శుక్రుడు సాధారణంగా నీచ స్థితి ఫలితాలనే ఇవ్వడం జరుగుతుంది కానీ, శుక్రుడికి చెందిన వృషభ రాశి నుంచి గురువు శుక్ర గ్రహాన్ని వీక్షించడం వల్ల ఈ గ్రహానికి నీచత్వం తొలగిపోయే అవకాశం ఉంది. వృషభం, మిథునం, కన్య, ధనుస్సు, మకరం, మీన రాశుల వారికి దీనివల్ల నీచభంగ రాజయోగం పడుతుంది. ఈ నీచభంగ రాజయోగం వల్ల ఈ రాశులవారి జీవితాల్లో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

  1. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు పంచమ కోణంలో సంచారం ప్రారంభిస్తున్నందువల్ల, అనేక విధాలుగా ఆదా యం పెరిగే అవకాశం ఉంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురు తుంది. రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తితో ప్రేమలో పడడం జరుగుతుంది. జీవన శైలిలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. బంధుమి త్రుల్లోనే కాక, వృత్తి, ఉద్యోగాల్లో కూడా మంచి గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.
  2. మిథునం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల ఈ రాశివారికి నీచభంగ రాజయోగం ఏర్పడుతోంది. దీనివల్ల గృహ, వాహన సౌకర్యాలు ఏర్పడతాయి. సంపన్నుల స్థాయికి చేరే అవకాశం ఉంది. ఆస్తి విలువ పెరుగుతుంది. సంపద వృద్ధి చెందుతుంది. మాతృ సౌఖ్యం, మాతృమూలక ధనం లభిస్తాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవ కాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి.
  3. కన్య: ఈ రాశిలో సంచారం చేస్తున్న శుక్రుడి మీద భాగ్య స్థానం నుంచి గురు దృష్టి పడినందువల్ల మన సులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరుతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభి స్తుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం బాగా వృద్ధి చెందుతాయి. కొన్ని శుభ పరిణామాలు జీవితాన్ని మలుపు తిప్పుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు పెరుగుతాయి.
  4. ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర సంచారం, దాని మీద రాశ్యధిపతి గురువు దృష్టి ఉండడం వల్ల ఈ రాశివారికి రాజయోగం, ధన యోగం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ఉద్యో గం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సానుకూలపడతాయి. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా బాగా పుంజుకుంటాయి. అనేక మార్గాల్లో ధనాదాయం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
  5. మకరం: ఈ రాశికి భాగ్య స్థానంలో ఉన్న శుక్రుడి మీద గురు దృష్టి పడినందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకే కాకుండా, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు అందుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. విదేశీ ప్రయాణాలకు అవకాశం ఉంది. ఒకటికి రెండుసార్లు ధన యోగాలు పడతాయి. గృహ, వాహన సౌకర్యాలకు ప్లాన్ చేస్తారు. తీర్థయాత్రలు, విహార యాత్రలు చేస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి.
  6. మీనం: ఈ రాశికి సప్తమంలో శుక్రుడు సంచారం ప్రారంభించడం, దాని మీద రాశ్యధిపతి గురువు దృష్టి పడడం వల్ల అనేక విధాలుగా భాగ్య యోగాలు పడతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. రావలసిన డబ్బు, వసూలు కావలసిన మొండి బాకీలు చేతికి అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా వృద్ది చెందుతాయి. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడ తాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం, పెళ్లి కావడం వంటివి జరుగుతాయి.