Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఆగస్టు 23, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. మిథున రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఆ రాశి వారు ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 23rd August 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 23, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఆగస్టు 23, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా కుటుంబ ఖర్చులు పెరుగుతాయి. మిథున రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

కొందరు బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెంచే ఆలోచన చేస్తారు. ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. చేపట్టిన పనులన్నిటినీ సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అధికారుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి జీవితంలో క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఉంటుంది. ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగాలు, వ్యాపారాల్లో చిన్నపాటి వివాదాలు, సమస్యలు ఉండే అవకాశం ఉంది. వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. కుటుంబంతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొద్దిగా కుటుంబ ఖర్చులు పెరుగుతాయి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

పిల్లల ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వ్యాపారాల్లో కార్యకలాపాలు బాగా పెరుగుతాయి. ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో శ్రమ ఎక్కువగా ఉన్నా ఫలితం ఉంటుంది. చేపట్టిన పనులు కొద్దిగా నిదానంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహవంతంగా ఉంటుంది. కొన్ని వ్యవహారాలు వ్యయప్రయాసలతో పూర్తవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, వృథా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఇంటా బయటా పని భారం ఎక్కువై, విశ్రాంతి దూరమవుతుంది. ప్రయాణాల వల్ల లాభాలు కలు గుతాయి. వ్యాపారాల్లో అనుకూలతలు పెరుగుతాయి. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవు తాయి. ఆర్థిక వ్యవహారాలు సవ్యంగా సాగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కు వగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నా లన్నీ సత్ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

చేపట్టిన పనుల్లో కార్యజయం కలుగుతుంది. బంధువుల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది. ఇల్లు కొనే ప్రయత్నాలు ఫలి స్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వాహన యోగం పడుతుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా అండగా నిలబడ తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

చిన్ననాటి మిత్రులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాల్లో ఆర్థిక సమస్యలను చాలా వరకు అధిగమిస్తారు. ఉద్యోగాల్లో పనిభారం నుంచి, అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు, కొత్త కార్యక్రమాలు చేపట్టడానికి ఇది అనుకూలమైన సమయం. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కుటుంబ వ్యవహారాల్లో కొన్ని మార్పులు చేపడతారు. ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు చాలావరకు తొలగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది. ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలుంటాయి. ఉద్యో గాల్లో పని ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన విదేశీ సంబంధం ఖాయ మవుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కుటుంబ సభ్యులతో బాగా ఎంజాయ్ చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కొందరు దగ్గర బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగంలో అధికారులు మీకు బాగా ప్రాధాన్యం ఇస్తారు. ఆదాయం, ఆరోగ్యం నిలక డగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభం కలిగే అవకాశం ఉంది. ధనాదాయం బాగుంటుంది. ప్రము ఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి. వృత్తుల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఉద్యోగులు తమ పనితీరుతో అధికారులను ఆకట్టుకుం టారు. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్యమైన పనులన్నిటినీ పట్టుదలగా పూర్తి చేసి, ఊరట చెందుతారు. ఆకస్మిక ప్రయా ణాలు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి ఉత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రోత్సాహ కర వాతావరణం ఉంటుంది. కుటుంబసమేతంగా పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా ఇరకాటంలో పడతారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

బంధువుల సహకారంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పలుకుబడి కలిగిన వారితో పరి చయాలు విస్తృతమవుతాయి. చేపట్టిన వ్యవహారాలన్నీ సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో లాభా లకు లోటుండకపోవచ్చు. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. స్వల్ప అనారోగ్య సమస్యలుండే సూచ నలున్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆదాయం బాగా పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమకు, పెట్టుబడికి తగ్గ ఫలితం ఉంటుంది. ఆస్తి వివాదం ఒకటి దాదాపు పరిష్కారం అవుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులన్నీ సకాలంలో, సంతృప్తి కరంగా పూర్తవుతాయి. ఉద్యోగులు ఉన్నత హోదాలు పొందుతారు. నిరుద్యోగులకు కొత్త అవ కా శాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి

ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?
ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?