Money Astrology: కీలక గ్రహాల యుతి.. రెండు యోగాలతో ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి
ఈ నెల 25, 26, 27 తేదీల్లో వృషభ రాశిలో కుజ, గురు, చంద్రుల యుతి జరుగుతున్నందువల్ల కొందరి జీవితాల్లో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా స్వల్పకాలిక ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. వృషభ రాశిలో చంద్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు, అక్కడ కుజుడిని, గురువును కలుసుకోవడం వల్ల గజకేసరి యోగం, చంద్ర మంగళ యోగం పట్టడం జరుగుతుంది.
ఈ నెల 25, 26, 27 తేదీల్లో వృషభ రాశిలో కుజ, గురు, చంద్రుల యుతి జరుగుతున్నందువల్ల కొందరి జీవితాల్లో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా స్వల్పకాలిక ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. వృషభ రాశిలో చంద్రుడు ఉచ్ఛపట్టడంతో పాటు, అక్కడ కుజుడిని, గురువును కలుసుకోవడం వల్ల గజకేసరి యోగం, చంద్ర మంగళ యోగం పట్టడం జరుగుతుంది. ఈ రెండు యోగాల వల్ల కొన్ని రాశులకు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి తప్పకుండా ఆర్థిక పరిస్థితిలో సానుకూల మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఇది మూడు రోజుల వ్యవహారంగా కనిపిస్తున్నప్పటికీ దీని ప్రభావం మాత్రం నెల రోజులకు పైగా ఉంటుంది.
- మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు ధన స్థానంలో ఉండడం, దాంతో గురు, చంద్రులు కలవడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. అనేక వైపుల నుంచి ధన లాభం ఉండే అవకాశం ఉంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి, ఆర్థిక సమస్యల బయటపడే అవకాశం ఉంటుంది. అనుకోకుండా ఆస్తి కలిసి వస్తుంది. షేర్లు, వ్యాపారాల్లో మదుపు చేయడానికి ఇది సరైన సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
- వృషభం: ఈ రాశిలో ఉచ్ఛ చంద్రుడు గురు, కుజుల్ని కలుసుకోవడం వల్ల స్థిరాస్తులు, భూ సంబంధమైన ఆస్తులు వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. తప్పకుండా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. లాభదా యక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో హోదాలు పెరగడంతో పాటు జీతభత్యాల్లో కూడా వృద్ధి ఉంటుంది. ప్రయాణాల వల్ల ఆర్థికంగా లాభం ఉంటుంది. ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ కావడం జరుగుతుంది. నిరుద్యోగులకు మంచి జీతభత్యాలతో కూడిన ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
- కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో రాశ్యధిపతి చంద్రుడు ఉచ్ఛపట్టడం, పైగాగురు, కుజులను కలవడం వల్ల గజకేసరి, చంద్ర మంగళ యోగాలు ఏర్పడడం వల్ల ఈ రాశివారి జీవితంలో అనేక శుభ పరిణా మాలు చోటు చేసుకుంటాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా లాభాలు అందుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది.
- కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో లాభాధిపతి చంద్రుడు ఉచ్ఛపట్టడం ఒక విశేషం కాగా, ఇక్కడ రెండు మహా ధన యోగాలు పట్టడం మరో విశేషం. కెరీర్ లోనే కాకుండా, కుటుంబంలో కూడా శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు ఘన విజయాలు సాధిస్తాయి. ఉద్యో గంలో ఉన్నత స్థాయి హోదాలు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచి ఆస్తి సంక్రమిస్తుంది. తీర్థయాత్రలకు అవకాశం ఉంది.
- వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి కుజుడితో గురు, చంద్రులు కలవడం వల్ల తప్పకుండా రాజయోగం పడుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఎటువంటి పోటీలోనైనా గెలుపు మీదే అవుతుంది. ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. బ్యాంక్ నిల్వలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడి లాభాల బాట పడతాయి. సంపన్న కుటుంబంతో మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది.
- మకరం: ఈ రాశికి పంచమ కోణంలో రెండు మహా యోగాలు చోటు చేసుకుంటున్నందువల్ల ఈ రాశివారి మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరే అవకాశం ఉంది. పేరు ప్రఖ్యాతులు వృద్ధి చెందు తాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుం తలు తొక్కుతాయి. అనేక శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి