Horoscope Today: వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.. 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు
దిన ఫలాలు (ఆగస్టు 24, 2024): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. మిథున రాశి వారికి ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు డబ్బు చేతికి అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
దిన ఫలాలు (ఆగస్టు 24, 2024): మేష రాశి వారికి ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. మిథున రాశి వారికి ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు డబ్బు చేతికి అందుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఉద్యోగంలో మీ శ్రమకు, ప్రతిభకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. కుటుంబ సభ్యుల తోడ్పాటుతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సఫలం కావచ్చు. వృత్తి జీవితం బాగానే సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయం బాగానే ఉంటుంది. పిల్లలు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శి స్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండ డం అవసరం. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ప్రస్తుతానికి ఎవరికీ హామీలు ఉండవద్దు.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఆదాయం అనేక విధాలుగా వృద్ధి చెందుతుంది. రావలసిన డబ్బు డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మంచి మార్పులు చేపట్టి సఫ లం అవుతారు. కొత్త కార్యక్రమాలకు, కొత్త ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యో గంలో కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇష్టమైన మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొం టారు. అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. వృథా ఖర్చుల్ని వీలైనంత తగ్గించుకోవడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం శ్రేయస్కరం. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి అనుకూలతలు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో సామరస్య వాతావరణం నెల కొంటుంది. వ్యక్తిగత సమస్యల నుంచి కొద్దిగా విముక్తి లభిస్తుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. ఆదాయం పెరగడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడ తాయి. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరి ష్కార దిశగా సాగుతుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం విష యంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం పొందుతారు.
కన్య ( ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వ్యక్తిగతంగా చిన్నా చితకా సమస్యలున్నా వాటిని తేలికగా అధిగమిస్తారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొద్ది ప్రయత్నంతో కుటుంబ సమ స్యల్ని పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. వ్యాపారంలో లాభా లకు కొరత ఉండదు. పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం ఉంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులు అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. ఆరోగ్యానికి లోటుండదు.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. అధికారుల బాధ్యతలను పంచుకునే అవకాశం కూడా ఉంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఇంటా బయటా అనుకూల వాతా వరణం ఉంటుంది. సోదరులతో సత్సంబంధాలు వృద్ధి చెందుతాయి. కొందరు మిత్రుల నుంచి రావ లసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
రావలసిన డబ్బు సకాలంలో అందక ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండకపోవచ్చు. కుటుంబ పరిస్థితులు బాగా అనుకూలంగా ఉంటాయి. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. జీవిత భాగ స్వామితో అన్యోన్యత పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా గడుపుతారు. వృత్తి, ఉద్యో గాల్లో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థిక వ్యవహారాలను, కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి పెడతారు. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనా లను మించుతాయి. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశ మనం లభిస్తుంది. మిత్రుల సహాయంతో కొన్ని పనుల్ని పూర్తి చేస్తారు. ఆస్తి వివాదంలో కొద్దిగా సామరస్యం ఏర్పడుతుంది. ఉద్యోగంలో హోదా పెరగవచ్చు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
వ్యాపారాల్లో కొద్దిపాటి ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. వృత్తి జీవితంలో కొద్దిగా కూడా తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి తోడ్పా టుతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందు తాయి. ఆలయాలను సందర్శిస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది.ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో పనిభారం ఎక్కువగా ఉంటుంది. అధికారులు అతిగా ఆధారపడతారు. వృత్తి జీవితం బాగా అనుకూలంగా సాగిపోతుంది. ఆర్థిక వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకో వద్దు. జీవిత భాగస్వామితో సంప్రదించడం మంచిది. వ్యక్తిగత సమస్యలు చాలావరకు నెమ్మది స్తాయి. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలకు అవకాశం ఉంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది. ఆర్థిక లాభాలకు ఎక్కువగా కలుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి లాబాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సంబంధించి శుభ వార్తలు వినడం జరుగుతుంది. ఇష్టమైన వ్యక్తుల్ని కలుసుకుంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపో తుంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం అనుకూలంగా కొనసాగుతుంది.