Money Astrology: అనుకూలంగా గురు గ్రహం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!

ప్రస్తుతం గురు గ్రహం వృషభ రాశిలో తనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోహిణీ నక్షత్రంలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ గ్రహం రోహిణి నక్షత్రంలో మరో నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. చంద్రుడికి సంబంధించిన రోహిణి నక్షత్రంలో గురు సంచారం వల్ల తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తి వంటి ధన యోగాలు పట్టే అవకాశం ఉంటుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఈ సంచారం వల్ల ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది.

Money Astrology: అనుకూలంగా గురు గ్రహం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!
Money Astrology
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 27, 2024 | 12:08 PM

ప్రస్తుతం గురు గ్రహం వృషభ రాశిలో తనకు అత్యంత ప్రీతిపాత్రమైన రోహిణీ నక్షత్రంలో సంచారం చేయడం జరుగుతోంది. ఈ గ్రహం రోహిణి నక్షత్రంలో మరో నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. చంద్రుడికి సంబంధించిన రోహిణి నక్షత్రంలో గురు సంచారం వల్ల తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తి వంటి ధన యోగాలు పట్టే అవకాశం ఉంటుంది. మేషం, వృషభం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకర రాశుల వారికి ఈ సంచారం వల్ల ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది.

  1. మేషం: ఈ రాశికి ధన స్థానంలో భాగ్యాధిపతి గురు సంచారం జరుగుతున్నందువల్ల ఆదాయానికి లోటు ఉండని పరిస్థితికి చేరుకోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా మెరుగుపడు తుంది. రావలసిన డబ్బు తప్పకుండా బ్యాంక్ ఖాతాలో పడుతుంది. ధన సంపాదనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు కొరత ఉండదు. ఉద్యోగంలో అద నపు రాబడికి కూడా అవకాశం ఉంటుంది. వారసత్వ సంపద కలిసి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి.
  2. వృషభం: ప్రస్తుతం గురు గ్రహం ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల తప్పకుండా ఆర్థిక లాభాలు అనేకం కలుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. సంపాదనే ప్రధాన ధ్యేయంగా మారు తుంది. ఉద్యోగంలో జీతంతో పాటు అదనపు రాబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల పరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. జీవిత భాగస్వామి తదితర కుటుంబ సభ్యుల ఆదాయం కూడా పెరిగే సూచనలున్నాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టడం, మదుపు చేయడం జరుగుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో గురువు సంచారం చేయడం వల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవు తుంది. రోహిణి నక్షత్రం ఈ రాశినాథుడైన చంద్రుడి నక్షత్రం అయినందువల్ల గురువు అనేక విధా లుగా ఈ రాశివారికి ధన యోగాలు కలిగిస్తాడు. తప్పకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సాధారణ వ్యక్తి సైతం సంపన్నుడుగా మారే అవకాశం ఉంటుంది. ఉద్యోగం ద్వారానే కాక, వృత్తి, వ్యాపారాల ద్వారా కూడా అత్యధికంగా సంపాదించడం జరుగుతుంది. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది.
  4. కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో, లాభాధిపతి అయిన చంద్రుడి నక్షత్రంలో గురు సంచారం జరుగుతు న్నందువల్ల లాటరీలు, వడ్డీ వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, షేర్లు, ఆర్థిక లావాదేవీల వల్ల ఈ రాశి వారికి అత్యధికంగా లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాలు, అదనపు రాబడి, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు తప్పకుండా చేతికి అందుతుంది. బాకీలన్నీ వసూలవుతాయి. లాభసాటి వ్యాపారాల్లో మదుపు చేయడం జరుగుతుంది.
  5. వృశ్చికం: ఈ రాశికి సప్తమంలో, భాగ్య స్థానాధిపతి అయిన చంద్రుడి నక్షత్రంలో గురువు సంచారం చేస్తు న్నందువల్ల ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. విదేశీ సొమ్మును అనుభవించే యోగం కూడా పడుతుంది. ప్రభుత్వమూలక ధన లాభానికి, పితృమూలక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. గృహ, వాహన యోగాలు పట్టే సూచనలున్నాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ప్రయాణాలన్నీ లాభిస్తాయి. కొందరు ప్రముఖులతో లాభసాటి పరిచయాలు ఏర్పడతాయి.
  6. మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో ధన కారకుడైన గురువు సంచారం వల్ల ఆర్థిక ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. కుటుంబ సభ్యుల నుంచి కూడా ధన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో హోదాతో పాటు జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా అంచనాలకు మించి పురోగతి సాధిస్తాయి. మరింత ఎక్కువ సంపాదనకు అవకాశం ఉన్న ఉద్యోగంలో చేరడం జరుగుతుంది.

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో