Moon Astrology: అత్యంత శుభుడుగా చంద్రుడు..ఆ రాశుల వారికి శుభ ఫలితాలు పక్కా..!

ఈ నెల 29వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు చంద్రుడు మేష, వృషభ రాశుల్లో సంచారం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మేష రాశిలో ఉన్న కుజుడు చంద్రుడికి మిత్రుడు. అదే విధంగా వృషభ రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న గురువు కూడా చంద్రుడికి మిత్రుడు. పైగా వృషభ రాశిలో చంద్రుడు ఉచ్ఛపట్టడం జరుగుతుంది.

Moon Astrology: అత్యంత శుభుడుగా చంద్రుడు..ఆ రాశుల వారికి శుభ ఫలితాలు పక్కా..!
Moon Astrology
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 27, 2024 | 1:00 PM

ఈ నెల 29వ తేదీ నుంచి జూలై 4వ తేదీ వరకు చంద్రుడు మేష, వృషభ రాశుల్లో సంచారం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మేష రాశిలో ఉన్న కుజుడు చంద్రుడికి మిత్రుడు. అదే విధంగా వృషభ రాశిలో ఇప్పటికే సంచారం చేస్తున్న గురువు కూడా చంద్రుడికి మిత్రుడు. పైగా వృషభ రాశిలో చంద్రుడు ఉచ్ఛపట్టడం జరుగుతుంది. ఈ మార్పుల కారణంగా చంద్రుడు అత్యంత శుభుడుగా మారి, మేషం, వృషభం, కర్కాటకం, సింహం, మకరం, కుంభ రాశులకు శుభ ఫలితాలనివ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఆదాయం పెరగడం, ఆరోగ్యం మెరుగుపడడం, మనశ్శాంతి ఏర్పడడం, సుఖ సంతోషాలు వృద్ధి చెందడం వంటివి తప్పకుండా జరుగుతాయి.

  1. మేషం: ఈ రాశిలో ఉన్న రాశ్యధిపతి కుజుడితో చంద్రుడు కలవడం వల్ల చంద్ర మంగళ యోగం ఏర్పడింది. ఈ యోగం ఏర్పడినప్పుడు తప్పకుండా అధికార యోగం పడుతుంది. సర్వతా మాట చెలామణీ అవుతుంది. ఆదాయం బాగా పెరిగి, డబ్బు దాచుకోవడం, మదుపు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ధన స్థానంలో గురువుతో కలవడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఒక సెలబ్రిటీగా గుర్తింపు లభిస్తుంది.
  2. వృషభం: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజ చంద్రులు కలవడం వల్ల విదేశీ సొమ్మును అనుభవించే యోగం పడుతుంది. విదేశాలకు వెళ్లడానికి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఆ తర్వాత చంద్రుడు వృషభ రాశిలో ప్రవేశించడంతో గురువుతో యుతి కలిగి గజకేసరి యోగం పడుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. జీవనశైలి మారిపోతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి అధిపతి అయిన చంద్రుడు మేష, వృషభ రాశుల్లో తన మిత్రులను కలుసుకోవడం, వృషభ రాశిలో ఉచ్ఛపట్టడం వల్ల ఒక ప్రముఖుడుగా చెలామణీ అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. పట్టిం దల్లా బంగారం అవుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కుతాయి. విదేశీ అవకాశాలు అంది వస్తాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఉంటుంది.
  4. సింహం: ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్ర మంగళ యోగం, దశమ స్థానంలో గజకేసరి యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారికి అటు ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందడంతో పాటు ఇటు అధికార యోగం పట్టడం, ప్రాధాన్యం, ప్రాభవం పెరగడం వంటివి కూడా జరుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అందుతాయి. ఆదాయాన్ని మదుపు చేయడం, దాచడం జరుగుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ కలిసి వస్తాయి. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది.
  5. మ‍కరం: చంద్ర సంచారం కారణంగా ఈ రాశికి నాలుగవ స్థానంలో చంద్ర మంగళ యోగం, పంచమంలో గజకేసరి యోగం పడుతున్నందువల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా సర్వత్రా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆస్తిపాస్తుల మీద మదుపు చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా అవకాశముంది.
  6. కుంభం: ఈ రాశికి చంద్ర సంచారంతో ఏర్పడే చంద్ర మంగళ యోగం, గజకేసరి యోగం అనేక విధాలుగా శుభ ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా ఆదాయానికి లోటుండదు. ఆదాయం దినదినాభివృద్ధి చెందు తుంది. ఈ యోగాలు పట్టిన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్న పక్షంలో అవి తప్ప కుండా సత్ఫలితాలనిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. ఆరోగ్యం బాగా మెరు గుపడుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో