Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (జూన్ 28, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 28th June 2024
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 28, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జూన్ 28, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అనుకూలతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆశించిన సహాయ, సహకారాలు లభిస్తాయి. వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్ల వంటి వృత్తుల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. అనుకో కుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు తొలగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగు తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో జీతభత్యాలతో పాటు హోదా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతోంది. వృత్తి జీవితంలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో లాభాలకు లోటుండదు. ఆదాయంలో అంచనాలకు మించిన పెరుగుదల ఉంటుంది. ముఖ్యమైన వ్యవహా రాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో మీ మాటకు, చేతకు విలువపెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపో తాయి. కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం ఆశించిన స్థాయిలో పెరుగు తుంది. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. వాగ్దానాలు, హామీలకు దూరంగా ఉండడం మంచిది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం ప్రశాంతంగా, అన్యోన్యంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ జీవితం చాలావరకు సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఇంటా బయటా ఒత్తిడి ఉంటుంది. సహోద్యోగులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. వ్యాపారం మీద శ్రద్ధ పెంచాల్సిన అవ సరం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. అనవసర వాగ్దానాలు చేయ వద్దు. తల్లితండ్రుల ఆరోగ్యం మీద బాగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. కుటుంబ జీవితంలో అన్యో న్యత పెరుగుతుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సాదా సీదాగా గడిచిపోతుంది. ఆదాయపరంగా అనుకోని శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. వృత్తి జీవితంలో ఉన్న వారికి గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. ఆదాయం అన్ని విధాలా మెరుగ్గా ఉంటుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. తోబుట్టువులతో విభేదాలు సమసి పోతాయి. కుటుంబ జీవితం ఉత్సాహవంతంగా సాగిపోతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశ ముంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి సమస్యలున్నా అధిగమిస్తారు. పనిభారం పెరిగి ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. నిరుద్యో గులకు మంచి ఆఫర్లు అందుతాయి. అనుకోకుండా పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా సాగిపో తాయి. కుటుంబంతో కలిసి విహారానికి వెళ్లే అవకాశం ఉంది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగు తుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశముంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆశించిన స్థాయిలో ఆదా యం పెరగవచ్చు. ప్రస్తుతం ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అయ్యే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఆశిం చిన శుభవార్తలు అందుతాయి. ఆహార, విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ )

ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. విశ్రాంతి తగ్గే అవకాశం ఉంది. కొందరు మిత్రుల తోడ్పాటుతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగు తుంది. కొద్ది ప్రయత్నంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధి స్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి జీవితంలో అనుకూల పరిస్థి తులు నెలకొంటాయి. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. సొంత ఆలోచనల వల్ల ఫలితం ఉంటుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. కొద్ది పాటి వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఆర్థిక ప్రయత్నాలకు సాను కూల స్పందన లభిస్తుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. సహచరుల నుంచి కొద్దిగా ఇబ్బందులుంటాయి. వృత్తి జీవితంలో ఆటంకాలను అధిగమిస్తారు. వ్యాపారులకు అనేక విధాలుగా సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారులు అతిగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు కూడా లాభసాటిగా పురోగతి చెందుతాయి. ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరి స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉండి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. కుటుంబ సభ్యుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కార్యకలాపాలు పెరుగు తాయి. లాభాలకు లోటుండదు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. కుటుంబ బాధ్య తలు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొందరు మిత్రుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎవరికీ హామీలు ఉండవద్దు.

Latest Articles