Zodiac Signs: వృషభ రాశిలో గురు గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా..!

ప్రస్తుతం వృషభ రాశిలో గురు గ్రహ సంచారం చేస్తున్నందువల్ల ఆరు రాశులు అత్యధికంగా శుభ ఫలితాలను పొందే అవకాశముంది. ఈ రాశుల వారి జీవితాలు వచ్చే ఏడాది మే చివరి వరకూ ఆదాయం, ఆరోగ్యం, అధికారం వంటి కీలక విషయాల్లో శుభప్రదంగా సాగిపోతాయి.వృషభ రాశిలో ఉన్న గురువు ఈ రాశులను ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ ప్రభావితం చేయడం వల్ల ఈ రాశులకు అనేక కష్టనష్టాల నుంచి రక్షణ లభిస్తుంది.

Zodiac Signs: వృషభ రాశిలో గురు గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి శుభ యోగాలు పక్కా..!
Shubha Yogas
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Jun 27, 2024 | 7:33 PM

ప్రస్తుతం వృషభ రాశిలో గురు గ్రహ సంచారం చేస్తున్నందువల్ల ఆరు రాశులు అత్యధికంగా శుభ ఫలితాలను పొందుతున్నాయి. ఈ రాశుల వారి జీవితాలు వచ్చే ఏడాది మే చివరి వరకూ ఆదాయం, ఆరోగ్యం, అధికారం వంటి కీలక విషయాల్లో శుభప్రదంగా సాగిపోతాయి. ఈ రాశులుః వృషభం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మకరం, మీనం. వృషభ రాశిలో ఉన్న గురువు ఈ రాశులను ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ ప్రభావితం చేయడం వల్ల ఈ రాశులకు అనేక కష్టనష్టాల నుంచి రక్షణ లభిస్తుంది. గురు గ్రహ ప్రభావాన్ని జ్యోతిషశాస్త్రం దైవానుగ్రహంగా అభివర్ణించడం జరిగింది.

  1. వృషభం: ఈ రాశిలో గురు సంచారం వల్ల కష్టనష్టాలు దరి చేరే అవకాశం ఉండదు. ఏ సమస్య అయినా దానంతటదే తొలగిపోతుంటుంది. ఆర్థిక అవసరాలు తీరిపోతుంటాయి. సంతాన యోగానికి అవకాశం ఉంటుంది. పిల్లల నుంచి ఎక్కువగా శుభవార్తలు వినడం జరుగుతుంది. దాంపత్య సమస్యలు పరిష్కారం అవుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.
  2. కన్య: ఈ రాశి మీద గురు దృష్టి పడినందువల్ల వృత్తి, ఉద్యోగాల్లోనే కాకుండా కుటుంబపరంగా శుభ పరి ణామాలు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. విదేశీ ప్రయాణాలకు, విదేశాల్లో ఉద్యోగాలకు ఆటంకాలు తొలగు తాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. తగిన వైద్య సదుపాయం లభిస్తుంది. మనసులోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. అనేక విధాలుగా అదృష్టం పట్టే అవకాశ ముంది.
  3. వృశ్చికం: అర్ధాష్టమ శని వల్ల అనేక కష్టనష్టాలు పడవలసిన ఈ రాశివారు కేవలం గురు దృష్టి కారణంగా సుఖ సంతోషాలను అనుభవించడం జరుగుతుంది. కుటుంబ సమస్యలు సునాయాసంగా తొలగి పోతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరి ష్కారం అవుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. ఇంట్లో శుభ కార్యాలు జరిగే అవకాశం ఉంది.
  4. ధనుస్సు: ఈ రాశినాథుడైన గురువు ఆరవ రాశిలో స్థిర రాశిలో ఉండడం వల్ల ఈ రాశివారికి ఆర్థిక సమ స్యలు అనేకం తేలికగా పరిష్కారం అవుతాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. శత్రు, రోగ, రుణ బాధల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారడం జరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు దిన దినాభివృద్ధి చెందుతాయి. కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడగలుగుతారు.
  5. మకరం: ఈ రాశి మీద పంచమ స్థానం నుంచి గురు దృష్టి పడినందువల్ల, వృత్తి, ఉద్యోగాలపరంగా అనేక కొత్త అవకాశాలు లభిస్తాయి. ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఆర్థికంగా బాగా పుంజుకుంటారు. మనసు లోని ముఖ్యమైన కోరికలు నెరవేరుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
  6. మీనం: ఈ రాశికి అధిపతి అయిన గురువు స్థిర రాశి అయిన వృషభంలో సంచారం చేస్తున్నందువల్ల సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు సునాయాసంగా విజయవంతం అవుతాయి. ఊహించని మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో దూకుడు పెరుగుతుంది. కుటుంబసమేతంగా ఇష్టమైన ప్రాంతాలను, ప్రదేశాలను సందర్శిస్తారు. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశముంది.

Latest Articles