Vastu Tips For Home: వాస్తు దోషాలున్నాయా.. ఏ దిక్కు దోషం తొలగాలంటే ఏ దేవుడిని పూజించాలంటే

వాస్తు శాస్త్రం భూమి, దిశలు, శక్తి సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. ఇల్లు తదితర నిర్మాణానికి సంబంధించిన అనేక విషయాలు శుభ, అశుభ ఫలితాల గురించి చెబుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటుందని నమ్మకం. శుభ కార్యాలలో అనవసరమైన ఆటంకాలు ఎదురవుతాయి. వాస్తు శాస్త్రంలో వివిధ దిశల వాస్తు దోషాలను తొలగించడానికి వివిధ దేవతలను పూజించాలని చెప్పబడింది.  

Vastu Tips For Home: వాస్తు దోషాలున్నాయా.. ఏ దిక్కు దోషం తొలగాలంటే ఏ దేవుడిని పూజించాలంటే
Vastu Tips For Home
Follow us

|

Updated on: Jun 27, 2024 | 7:58 AM

హిందూ మతంలో వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం చాలా ముఖ్యమైనవి. వాస్తు శాస్త్రంలో వివిధ దిశలలో కూడా వాస్తు దోషాలు ఉన్నాయని పేర్కొంది. వాస్తు దోషాల వల్ల మనిషికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. వీటిని అధిగమించాలంటే దిశానుసారంగా వివిధ దేవుళ్లను పూజించాలనే నియమం ఉంది. ఇలా పూజ చేయడం వలన దోషాలు తొలగి జీవితంలో ఏర్పడిన సమస్యల నుంచి ఉపశమనం పొందుతారని విశ్వాసం. జ్యోతిషశాస్త్రంలో వాస్తు శాస్త్రం ఒక ముఖ్యమైన శాఖగా పరిగణించబడుతుంది. ఈ వాస్తు శాస్త్రం భూమి, దిశలు, శక్తి సూత్రాల ఆధారంగా పనిచేస్తుంది. ఇల్లు తదితర నిర్మాణానికి సంబంధించిన అనేక విషయాలు శుభ, అశుభ ఫలితాల గురించి చెబుతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉంటుందని నమ్మకం. శుభ కార్యాలలో అనవసరమైన ఆటంకాలు ఎదురవుతాయి. వాస్తు శాస్త్రంలో వివిధ దిశల వాస్తు దోషాలను తొలగించడానికి వివిధ దేవతలను పూజించాలని చెప్పబడింది.

తూర్పు దిశ హిందూ మతంలో ప్రత్యేక్ష దైవం సూర్య భగవానుడు తూర్పు దిక్కుకు అధిదేవతగా పరిగణించబడుతున్నాడు. ఈ దిశలో వాస్తు దోషం ఉంటే తండ్రీకొడుకుల మధ్య బంధుత్వాలు, ఉద్యోగ సమస్యలు, కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తూర్పు దిశలో వాస్తు దోషాలు తొలగిపోవాలంటే సూర్యునికి నిత్యం అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం స్తోత్రాన్ని పఠించాలి. వీలయితే గాయత్రీ మంత్రాన్ని కూడా జపించడం శుభప్రదం.

ఇవి కూడా చదవండి

పశ్చిమ దిశ పశ్చిమ దిశకు అధిపతి శనీశ్వరుడు. ఈ దిశలో వాస్తు దోషం ఉంటే శని సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఈ దిశలోని దోషాలు తొలగిపోవాలంటే శనిశ్వరుడిని పూజించాలి. ప్రతి శనివారం శని చాలీసా పఠించండి. హనుమంతుడి ముందు ఆవనూనె దీపం వెలిగించండి.

ఉత్తర దిశ ఉత్తర దిశకు అధిదేవుడు బుధుడుగా భావిస్తారు. ఈ దిశలో దోషం ఉంటే.. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. వీటిని తొలగించుకోవాలంటే ఇంట్లో బుధ యంత్రాన్ని స్థాపించి గణేశుడిని పూజించండి.

దక్షిణ దిశ ఈ దిశ అంగారక గ్రహం అధిదేవత.. అంగారకుడు గ్రహాలకు యమరాజుగా పరిగణించబడుతున్నాడు. దక్షిణ దిశలో దోషం ఉంటే కోపం పెరిగి కుటుంబ సభ్యుల మధ్య పరస్పర వివాదాలు ఏర్పడతాయి. దక్షిణ దిక్కు దోషాలు తొలగిపోవాలంటే హనుమంతుడిని నిత్యం పూజించండి.

ఈశాన్య దిక్కు తూర్పుకి, ఉత్తరానికి మధ్యన ఉన్న దిక్కు ఈశాన్య దిశ. ఈ దిశకు వాస్తు శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఈశాన్య దిశకు పాలక గ్రహాలు గురువు శివుడు అధిదేవత. ఈ దిశలో వాస్తు దోషాలు ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. అటువంటి పరిస్థితిలో శివపార్వతులను పూజించాలి. ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచుకోవాలి.

ఆగ్నేయ దిక్కు తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్న దిక్కు ఆగ్నేయం దిశ. ఈ దిక్కుకు శుక్రుడు అదిదేవుడు. ఆగ్నేయం అగ్నికి మూలం. ఈ దిశలో వాస్తు దోషాలు ఉంటే భౌతిక సుఖాలు లేకపోవటం, ప్రేమ సంబంధాలు కుదరకపోవటం వంటి సమస్యలు వస్తాయి. దీని దోషాలు తొలగిపోవాలంటే లక్ష్మీదేవిని పూజించండి. శుక్ర యంత్రాన్ని ప్రతిష్టించి నిత్యం పూజించండి.

నైరుతి దిక్కు పడమర దక్షిణానికి మధ్య ఉన్న దిశను నైరుతి దిశ అంటారు. ఈ దిశకు అధిపతి నివృత్తి అనే రాక్షసుడు.. అంటే రాహు, కేతువులు. ఈ దోషం తొలగిపోవాలంటే శివునికి రోజూ నీళ్ళు సమర్పించి రాహు-కేతు దోష నివృత్తి కోసం నవ ధాన్యాలను దానం చేయండి.

వాయువ్య దిక్కు ఉత్తరానికి, పశ్చిమానికి మధ్యన ఉన్న దిక్కుని వాయవ్య దిశ అని అంటారు. ఈ దిక్కుకు అధిపతి చంద్రుడు. ఈ దిశలో వాస్తు దోషాలు ఉంటే ఒత్తిడి, జలుబు, మానసిక సమస్యలు, పునరుత్పత్తి సమస్యలను కలిగిస్తాయి. దీనిని అధిగమించడానికి చంద్రుని మంత్రాన్ని జపించి మహాదేవుని పూజించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో