21వ శతాబ్దపు అతి సుదీర్ఘ సూర్యగ్రహణం ఎప్పుడు సంభవించబోతుందంటే.. భారతదేశంలో కనిపిస్తుందా?

క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ నెలలో సంభవించనుంది. ఇది ఈ సంవత్సరం చివరి గ్రహణం కూడా కానుంది. ఈ సంవత్సరంలో ఏర్పడిన మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించలేదు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఏర్పడనున్న రెండవ సూర్యగ్రహణం గురించి ప్రజల మనస్సులలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది.. ఈసారి భారతదేశంలో కనిపిస్తుందా లేదా? తెలుసుకుందాం..

21వ శతాబ్దపు అతి సుదీర్ఘ సూర్యగ్రహణం ఎప్పుడు సంభవించబోతుందంటే.. భారతదేశంలో కనిపిస్తుందా?
Solar Eclipse
Follow us
Surya Kala

|

Updated on: Jun 27, 2024 | 11:36 AM

సూర్య గ్రహణానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంది. సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళ దృగ్విషయం. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా కవర్ చేస్తాడు. దీని కారణంగా భూమిపై సూర్యకాంతి పడది. ఇది పాక్షికంగా లేదా సంపూర్ణంగా జరుగుతుంది. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం 8 ఏప్రిల్ 2024న సంభవించింది. అయితే ఈ గ్రహణ ప్రభావం అమెరికా, దాని పరిసర దేశాలలో కనిపించింది. దీని తరువాత ఈ సంవత్సరంలో రెండవ, చివరి సూర్యగ్రహణం కూడా ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో ఏర్పడిన మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించలేదు. ఈ నేపధ్యంలో ఈ ఏడాది ఏర్పడనున్న రెండవ సూర్యగ్రహణం గురించి ప్రజల మనస్సులలో అనేక ప్రశ్నలు ఉన్నాయి. ఈ నేపధ్యంలో సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది.. ఈసారి భారతదేశంలో కనిపిస్తుందా లేదా? తెలుసుకుందాం..

ఖగోళ శాస్త్రం, జ్యోతిషశాస్త్రంలో సూర్యగ్రహణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇది అన్ని రాశులకు చెందిన వ్యక్తులతో పాటు దేశం, ప్రపంచంలో సానుకూల, ప్రతికూల మార్గాలను ప్రభావితం చేస్తుంది. క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ నెలలో సంభవించనుంది. ఇది ఈ సంవత్సరం చివరి గ్రహణం కూడా కానుంది. అటువంటి పరిస్థితిలో 2024 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం ఎప్పుడు సంభవిస్తుందంటే

సూర్యగ్రహణం 2024 ఎప్పుడు?

గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 2024 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2, 2024 బుధవారం రోజున ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం అక్టోబర్ 2 రాత్రి 09:10 నుంచి తెల్లవారుజామున 3:17 వరకు ఉంటుంది. అంటే సూర్యగ్రహణం ఏర్పడే మొత్తం వ్యవధి దాదాపు 6 గంటల 4 నిమిషాలు.

ఇవి కూడా చదవండి

ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా?

ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించలేదు. అదే సమయంలో ఇప్పుడు సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో ఈ గ్రహణం ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణం.

సూర్యగ్రహణ సూత కాలం ఉంటుందా

2024 సంవత్సరంలో రెండవ.. చివరి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా గ్రహణ సూత కాలం చెల్లదు లేదా సూత కాల నియమాలు అనుసరించాల్సిన అవసరం లేదు.

ఏ దేశాల్లో కనిపిస్తుందంటే

శాస్త్రజ్ఞుల అంచనాల ప్రకారం, మెక్సికో, బ్రెజిల్, చిలీ, పెరూ, న్యూజిలాండ్, అర్జెంటీనా, ఆర్కిటిక్, కుక్ దీవులు, ఉరుగ్వే మొదలైన దేశాల్లో 2024 సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం కనిపిస్తుంది.

సూత కాలం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహణానికి సరిగ్గా 10 గంటల ముందు సూత కాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో అనేక నియమాలను అనుసరిస్తారు. మతపరమైన దృక్కోణంలో సూత కాలం కొన్ని పనులు చేయరాదు. ఈ సమయంలో పూజలు చేయడం నిషేధం. అంతేకాదు చిన్న, పెద్ద దేవాలయాల తలుపులు మూసివేస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.