Viral Video: బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న చిన్నారి.. ఐపీఎస్ ఆఫీసర్ కల తీర్చిన అధికారులు
వారణాసికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారికి సంబంధించిన ఓ హృద్యమైన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రణవీర్ భారతి అనే చిన్నారి కి IPS అధికారి కావాలనేది కల. అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మహామన క్యాన్సర్ ఆస్పత్రిలో బ్రెయిన్ ట్యూమర్‌కు చికిత్స పొందుతోంది. IPS అధికారి కావాలనే ఆ చిన్నారి కల తీరింది.
ప్రస్తుతం కాలంలో వయసుతో సంబంధం లేకుండా పిల్లలు, పెద్దలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. ముక్కు పచ్చలారని చిన్నారులకు చిన్న వయసులోనే నిండు నూరేళ్ళు నిండిపోతున్నాయి. తాజగా వారణాసికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారికి సంబంధించిన ఓ హృద్యమైన కథ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రణవీర్ భారతి అనే చిన్నారి కి IPS అధికారి కావాలనేది కల. అయితే ఆ చిన్నారి బ్రెయిన్ ట్యూమర్ బారిన పడింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని మహామన క్యాన్సర్ ఆస్పత్రిలో బ్రెయిన్ ట్యూమర్‌కు చికిత్స పొందుతోంది. IPS అధికారి కావాలనే ఆ చిన్నారి కల తీరింది.
ADG జోన్ వారణాసి వారి అధికారిక X హ్యాండిల్‌లో చిన్నారి రణవీర్ భారతి కోరిక నెరవేరిన విషయాన్ని షేర్ చేశారు. 9 ఏళ్ల రణవీర్ భారతి వారణాసిలోని మహామన క్యాన్సర్ హాస్పిటల్‌లో బ్రెయిన్ ట్యూమర్‌కు చికిత్స పొందుతోంది. అటువంటి పరిస్థితిలో భారతి IPS అధికారి కావాలనే తన కోరికను వ్యక్తం చేసింది. ఆ చిన్నారి కోరిక గురించి పోలీసు అధికారుల వద్దకు తెలిసింది. ఇప్పుడు ఆ చిన్నారి కోరిక నేరవేరడంతో ఆ చిన్నారికి సంబందించిన ఫోటోలు నేట్టింట్లో షేర్ చేశారు. భారతి ఖాకీ దుస్తులు ధరించి ధరించి క్యాబిన్ లోపల కూర్చుంది. భారతి ఇతర పోలీసు సిబ్బందిని కలిసింది. అంతేకాదు పోలీసులకు షేక్ హ్యాండ్ ఇచ్చి సంతోషంగా గడిపింది ఆ చిన్నారి. ఈ వీడియో గ్రూప్ ఫోటోతో క్లోజ్ అయింది.
ఇక్కడ పోస్ట్‌ను చూడండి:
09 वर्षीय बालक रणवीर भारती के ब्रेन ट्यूमर का इलाज महामना कैंसर अस्पताल वाराणसी में चल रहा है, ऐसी अवस्था में रणवीर ने #IPS अधिकारी बनने की इच्छा व्यक्त की, तो #adgzonevaranasi @piyushmordia के कार्यालय में बच्चे की इच्छा की पूर्ति की गयी । pic.twitter.com/xxeGFT3UKe
— ADG ZONE VARANASI (@adgzonevaranasi) June 26, 2024
ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారు. నేను మనస్పూర్తిగా శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను అని ఒకరు కామెంట్ చేయగా మరొకరు ప్రశంసనీయమైన పని అంటూ వ్యాఖ్యానించారు. చాలా మంచి పని చేశారు అంటూ పోలీసు అధికారులపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు కొందరు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..