Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం మత్తులో ఎంపీకి కాల్‌చేసిన మందుబాబు.. అర్ధరాత్రి దుకాణం తెరవాలంటూ డిమాండ్.. ఆడియో వైరల్‌

నాలుగు పెగ్గులు కడుపులో పడ్డాక మందుబాబుల విన్యాసాలు మామూలుగా ఉండవు. మాటలు కోటలు దాటుతుంటాయి. కళ్లు బైర్లు కమ్ముతుంటాయి. రెండు కాళ్లపై నడవాల్సింది పోయి.. బదులుగా నాలుగు కాళ్లు కొత్తగా వస్తాయి. కొందరు పాముల్ని బెల్టులా చుట్టేసుకుంటారు.. మరికొందరు నీళ్లలో శవాసనాలు వేస్తుంటారు. ఇలాంటి ఘటనలు కూడా వైరల్ కావడం చూశాం. అయితే, తాజాగా ఓ తాగుబోతు ఏకంగా ఎంపీకే ఫోన్ చేశాడు.. వారి ఫోన్ సంభాషణ ప్రస్తుతం నెట్టింట హాల్ చల్ అవుతోంది.

మద్యం మత్తులో ఎంపీకి కాల్‌చేసిన మందుబాబు.. అర్ధరాత్రి దుకాణం తెరవాలంటూ డిమాండ్.. ఆడియో వైరల్‌
Bareilly Mp Viral Audio
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 27, 2024 | 11:27 AM

ఓ ఎంపీ, తాగుబోతు మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంట్రాక్టు ముగిసిన తర్వాత సదరు తాగుబోతు నేరుగా ఎంపీకి ఫోన్ చేశాడు. ఈ ఆడియోలో ఓ వ్యక్తి ఎంపీని మద్యం అడుగుతూ కనిపించాడు. మద్యం దుకాణం తొందరగా మూతపడుతుందని ఆ తాగుబోతు వ్యక్తి వాపోయాడు. ఆడియోలో, బరేలీ ఎంపీ ఛత్రపాల్ గంగ్వార్ అనే వ్యక్తికి మధ్య సంభాషణ ఇలా జరిగింది..

ఫోన్‌ చేస్తున్న వ్యక్తి ఎంపీకి ముందుగా సర్ జీ నమస్కార్ అన్నాడు. నేను అష్రాఫీ లాల్ గంగ్వార్ అంటూ పరిచయం చేసుకున్నాడు.. దానికి సమాధానంగా ఆ ఎంపీ.. సరే మంచిది అన్నాడు. ఆ వెంటనే తాగుబోతు మాట్లాడుతూ.. సర్‌ మా దగ్గర రాత్రి 10 గంటలకు ముందే దుకాణాలు మూసేశారని చెప్పాడు. ఏ దుకాణం అని ఎంపీ ప్రశ్నించగా, మద్యం దుకాణాలు సర్‌ అంటూ చెప్పాడు సదరు తాగుబోతు.

ఇవి కూడా చదవండి

ఆ వ్యక్తి మాటలు విన్న ఎంపీకి ఏమీ అర్థం కాలేదు. దీనిపై ఆ వ్యక్తి తనకు మద్యం తాగాలని ఉందని చెప్పాడు. ఎంపి ఛత్రపాల్ సింగ్ సరే.. ఢిల్లీ నుంచి మద్యం పంపిస్తానని బదులిచ్చారు. రాత్రి 10 గంటలలోపు దుకాణాలు మూసేస్తే..ఇకపై ఢిల్లీ నుంచి రావాలని ఆ వ్యక్తి బదులిచ్చాడు. అంతటితో ఆగలేదు అతడు..సర్ దయచేసి నా నంబర్‌ సేవ్ చేసుకోండి అని చెప్పాడు. ఎందుకు అని ఎంపీ ప్రశ్నించగా, మీరు మద్యం పంపడానికి అని బుదులిచ్చాడు సదరు తాగుబోతు. మందుబాబు మాటలకు ఎంపీకి ఒక్కసారిగా ఫ్యూజులు అవుట్‌ అయినట్టుగా మారింది పరిస్థితి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..