మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ భూతం.. 300 గుంజీలు తీసిన విద్యార్థి పరిస్థితి విషమం..

ర్యాగింగ్‌కు తన కుమారుడే కాదు, యాభై మందికి పైగా మెడికల్‌ విద్యార్థులు బాధితులుగా ఉన్నారని బాధిత విద్యార్థి తండ్రి ఆరోపించాడు. 40 మంది సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు కలిసి ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్స్‌ని ర్యాగింగ్‌ పేరిట వేధించారని అన్నారు. వారిలో కూడా కొందరు ఆస్పత్రి పాలయ్యారని చెప్పారు.

మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌ భూతం.. 300 గుంజీలు తీసిన విద్యార్థి పరిస్థితి విషమం..
Medical Students Ragging
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 27, 2024 | 10:10 AM

సీనియ‌ర్ల ర్యాగింగ్‌కు ఓ జూనియ‌ర్ విద్యార్థి తీవ్ర అనారోగ్యం పాల‌య్యాడు. ఫ‌స్టియ‌ర్ ఎంబీబీఎస్ స్టూడెంట్ చేత 300 గుంజిలు తీయించారు సెకండియ‌ర్ విద్యార్థులు. దీంతో బాధిత విద్యార్థి కిడ్నీ ఇన్‌ఫెక్ష‌న్‌తో బారినపడ్డాడు. ఇప్ప‌టికే అత‌నికి నాలుగు సార్లు డ‌యాల‌సిస్ చేయాల్సి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లోని దుంగార్పూర్ మెడిక‌ల్ కాలేజీలో ఈ ఏడాది మే 15వ తేదీన చోటుచేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది. దీనిపై మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ విచారణ చేపట్టింది. ఆ కమిటీ విచారణలో కూడా ర్యాగింగ్ ఆరోపణల్లో నిజం ఉందని తేలింది. ఆ కారణంగా ఏడుగురు సెకండ్‌ ఇయర్‌ ఎంబీబీఎస్‌ విద్యార్థులను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. అదే సమయంలో, ఏడుగురు విద్యార్థులపై వైద్య కళాశాల ప్రిన్సిపాల్ స్థానిక సదర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్ బాల మార్గుణవేలు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ర్యాగింగ్‌ ఘటన నెలన్నర క్రితం మే 15న జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ రోజు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్‌ని సెకండ్ ఇయర్ స్టూడెంట్ కాలేజీకి దగ్గర్లోని కొండకి పిలిచాడని, అక్కడ అతను మూడు వందల కంటే ఎక్కువ గుంజీలు తీయించారట. దీంతో ఆ విద్యార్థి ఆరోగ్యం క్షీణించింది. విద్యార్థిని కిడ్నీ, కాలేయం దెబ్బతిన్నాయి. విద్యార్థి పరిస్థితి విషమంగా మారటంతో వెంటనే దుంగార్‌పూర్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ శారీరక పరిస్థితి మెరుగుపడకపోవడంతో గుజరాత్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు.

ర్యాగింగ్‌కు తన కుమారుడే కాదు, యాభై మందికి పైగా మెడికల్‌ విద్యార్థులు బాధితులుగా ఉన్నారని బాధిత విద్యార్థి తండ్రి ఆరోపించాడు. 40 మంది సెకండ్‌ ఇయర్‌ విద్యార్థులు కలిసి ఫస్ట్‌ ఇయర్‌ స్టూడెంట్స్‌ని ర్యాగింగ్‌ పేరిట వేధించారని అన్నారు. వారిలో కూడా కొందరు ఆస్పత్రి పాలయ్యారని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా ర్యాగింగ్‌కు గురైన 20 మంది విద్యార్థులు.. దీనిపై మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. అవసరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..