HIV Positive: నిత్య పెళ్లికూతురికి హెచ్‌ఐవీ.. రెండు రాష్ట్రాల్లోని యువకుల్లో టెన్షన్‌ టెన్షన్‌..!

ఎట్టకేలకు విషయం పోలీసులకు చేరింది. మే 6న పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు చేయగా, హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. దీంతో పోలీసులకు షాక్‌ తిన్నంతపనైంది. ఆమె తనకున్న వ్యాధిని గతంలో ఎంతమందికి వ్యాపింపచేసిందోనని ఆందోళన మొదలైంది. గతంలో ఆమెను పెళ్లి చేసుకున్న యువకుల ఆచూకీ కోసం పోలీసులు రెండు రాష్ట్రాల్లో వేట కొనసాగిస్తున్నారు.

HIV Positive: నిత్య పెళ్లికూతురికి హెచ్‌ఐవీ.. రెండు రాష్ట్రాల్లోని యువకుల్లో టెన్షన్‌ టెన్షన్‌..!
Wedding
Follow us

|

Updated on: Jun 27, 2024 | 9:23 AM

అందం, డబ్బు ఉన్న అమ్మాయిల్ని టార్గెట్ చేసి, ప్రేమ పేరుతో వలలో వేసుకుని మోసం చేశాడంటూ అమ్మాయిలు పోలీసులను ఆశ్రయిస్తుంటారు. ప్రేమ, పెళ్లి పేరుతో తమను చీట్‌ చేశాడని, తమ వద్ద ఉన్న బంగారు, వెండి, నగదు వంటివి దోచుకుని తమను రోడ్డుమీద వదిలేశాడంటూ బాధిత యువతులు బోరున విలపించే వార్తలు అనేకం చూశాం. అయితే, ఇప్పుడు ట్రెండ్‌ మారింది. నేరాల్లోనూ తామేమీ తక్కువ కాదంటున్నారు కొందరు యువతులు. అన్నిట అబ్బాయిలే కాదు.. యువతులు కూడా ఆరు ఆకులు ఎక్కువే చదువుకున్నామని నిరూపిస్తున్నారు.

యువతులు కూడా నిత్య పెళ్లి కూతుర్లుగా మారి యువకుల్ని చీట్ చేస్తున్న ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా, ఓ నిత్య పెళ్లికూతుర్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. ఇందులో భాగంగా ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించగా టెస్ట్‌ రిపోర్ట్స్‌ చూసిన ఖాఖీలకు షాక్‌ తగిలినంత పనైంది. హెచ్ఐవీ పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమయ్యారు అధికారులు.

ఉత్తరాఖండ్‌లోని యూఎస్‌ నగర్‌ జిల్లాకు చెందిన 20 ఏళ్ల మహిళ యూపీ, ఉత్తరాఖండ్‌లలో పెళ్లి పేరుతో పలువురిని మోసం చేసింది. ఒకరికి తెలియకుండా మరొకరిని దొంగ పెళ్లి చేసుకుని నగలు, నగదుతో ఉడాయించేది. విషయం ఎట్టకేలకు పోలీసులకు తెలియటంతో మే 6న యూపీ పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి ముజఫర్‌నగర్‌ జైలుకు తరలించారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు చేయగా, హెచ్‌ఐవీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. దీంతో పోలీసులకు షాక్‌ తిన్నంతపనైంది. ఆమె తనకున్న వ్యాధిని గతంలో ఎంతమందికి వ్యాపింపచేసిందోనని ఆందోళన మొదలైంది. గతంలో ఆమెను పెళ్లి చేసుకున్న యువకుల ఆచూకీ కోసం యూపీ పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Latest Articles
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
చక్ దే ఇండియా..విశ్వ విజేతగా భారత జట్టు
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
లాంచింగ్‌కు సిద్ధమైన ఐఫోన్‌ 16.. ఫీచర్లు ఎలా ఉండనున్నాయంటే.
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
కింగ్ కోహ్లీ అర్ధ సెంచరీ.. దక్షిణాఫ్రికా టార్గెట్ ఎంతంటే?
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. ఇదిగో వెదర్ రిపోర్ట్
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
మంటెత్తే మిర్చీతో మెరిసిపోయే అందం.. ట్రై చేస్తే గొప్ప వరమే..
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
ఏమో శౌర్య.. ఈ విషయంలో మాత్రం నీ ఆలోచన ఏంటో అర్థం కావట్లా..?
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
వారెవ్వా..!! సైరాట్ మూవీ హీరోయిన్ ఏంటి ఇంతలా మారిపోయింది..
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
టీ, కాఫీ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా? నిపుణులు ఏమంటున్నారంటే.
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
భాగ్యనగరంలో ఏంటి ఈ దౌర్భాగ్యం.. వరుస హత్యలతో వణికిపోతున్న ప్రజలు
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో
రూ. 40వేల ఫోన్‌ రూ. 27వేలకే.. వన్‌ప్లస్‌ 11ఆర్‌పై అమెజాన్‌లో