AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అమానుషం.. హాస్పిటల్‌ సిబ్బంది పైశాచికం.. వృద్ధ రోగిని దారుణంగా కొడుతున్న వీడియో వైరల్‌..

అయితే ఈ వీడియో ఎక్కడిది. ఏ ఆసుపత్రికి చెందినది అనే దానిపై ఇంకా సమాచారం రాలేదు. కానీ, వీడియో మాత్రం సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో షేర్‌ అవుతూ విస్తృతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది వినియోగదారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Watch: అమానుషం.. హాస్పిటల్‌ సిబ్బంది పైశాచికం.. వృద్ధ రోగిని దారుణంగా కొడుతున్న వీడియో వైరల్‌..
Hospital Staff Hits Elderly
Jyothi Gadda
|

Updated on: Jun 27, 2024 | 8:07 AM

Share

ఏదైనా జబ్బుపడిన వ్యక్తి, అతని కుటుంబ సభ్యులు మొదట దేవుణ్ణి స్మరించుకుంటారు. ఆ తర్వాత భగవంతుని స్వరూపంగా చెప్పబడే వైద్యుని వద్దకు వెళతారు. అయితే, వైద్యులు తమ వృత్తికి, వారికున్న గుర్తింపును నాశనం చేసేలా ప్రవర్తిస్తుంటారు కొందరు డాక్టర్లరు. ప్రస్తుతం, ఒక భయానక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఒక వైద్యుడు ఆసుపత్రిలో చేరిన రోగిని దారుణంగా కొట్టాడు. ఇదంతా అక్కడున్న సీసీటీవీలో రికార్డయ్యాయి. అయితే ఆ వ్యక్తి డాక్టర్ కాదని, నర్సింగ్ స్టాఫ్ అని పలువురు అంటున్నారు.

వైరల్‌ వీడియోలో ఆస్పత్రి బెడ్‌పై ఓ పేషెంట్‌ పడుకుని ఉండడం కనిపిస్తోంది. అతను చాలా బలహీనంగా ఉన్నాడు. అతను తనకు తానుగా లేవలేకపోతున్నాడు. అప్పుడు ఒక వైద్యుడు అతని వద్దకు వచ్చి పరదా అడ్డుగా రోగి దగ్గర నిలబడ్డాడు. ఓసారి అటు ఇటు చూసి నేరుగా మోచేతితో పేషెంట్ ఛాతీపై దాడి చేశాడు. దీంతో ఆ రోగి ఆ నొప్పిని భరించలేక మూలుగుతున్న దృశ్యం కనిపించింది. మరోవైపు ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో రోగి పట్ల ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

సీసీటీవీ ప్రకారం ఈ వీడియో జూన్ 19 నాటిది. అయితే ఈ వీడియో ఎక్కడిది. ఏ ఆసుపత్రికి చెందినది అనే దానిపై ఇంకా సమాచారం రాలేదు. కానీ, వీడియో మాత్రం సోషల్ మీడియా అన్ని ప్లాట్‌ఫామ్‌లలో షేర్‌ అవుతూ విస్తృతంగా వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన చాలా మంది వినియోగదారులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..