Watch: అమెరికాలో గుజరాతీ వ్యక్తి హత్య.. ఒక్క పంచ్‌తో నిలువునా కుప్పకూలిన మృతుడు.. వీడియో వైరల్

వీడియోలో హేమంత్ ఒక వ్యక్తితో వాగ్వాదానికి దిగడం కనిపించింది. ఇంతలో హఠాత్తుగా రిచర్డ్ లూయిస్ హేమంత్ ముఖంపై బలంగా కొట్టాడు. దీంతో హేమంత్ వెంటనే కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హేమంత్‌కు తగలరాని చోట బలంగా దెబ్బతగలడంతో తిరిగి లేవలేని స్థితిలో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

Watch: అమెరికాలో గుజరాతీ వ్యక్తి హత్య.. ఒక్క పంచ్‌తో నిలువునా కుప్పకూలిన మృతుడు.. వీడియో వైరల్
Gujarati Man Murdered In America
Follow us

|

Updated on: Jun 27, 2024 | 7:10 AM

అమెరికాలో ఓ గుజరాతీ వ్యక్తి హత్యకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్న విషయంపై జరిగిన వాగ్వాదంతో స్థానిక వ్యక్తి ఆ భారతీయుడిపై దాడి చేసి, చంపేశాడు. మృతుడు నవ్‌సారి వాసుడిగా తెలిసింది.. అతని పేరు హేమంత్ మిస్త్రీ అని సమాచారం. అతడు గుజరాత్‌లోని నవ్‌సారి నివాసి, చాలా కాలంగా అమెరికాలో మోటెల్ నడుపుతున్నాడు. హత్యకు సంబంధించిన వీడియో బయటపడింది.

సమాచారం ప్రకారం, హేమంత్ మిస్త్రీ అమెరికాలో ఓక్లహోమా సిటీ మోటెల్‌ను నడుపుతున్నాడు. సంఘటన జరిగిన రోజు అతను చెత్త పడేసిన విషయంపై స్థానిక వ్యక్తితో వాగ్వాదం జరిగింది. ఇద్దరూ కొంత సేపు మాట మాట అనుకున్నాడు. ఈ క్రమంలోనే స్థానిక వ్యక్తి భారతీయుడిపై దాడి చేశాడు. నిందితుడు హేమంత్ ముఖంపై బలంగా కొట్టడంతో నిలువునా కిందపడిపోయి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే హేమంత్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. హేమంత్ మరణవార్త విని కుటుంబసభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వారి కుటుంబంలో తీరని విషాదం అలుముకుంది. హేమంత్‌పై దాడి చేసిన వ్యక్తి పేరు రిచర్డ్ లూయిస్ అని చెప్పిన పోలీసులు..అతనిపై హత్య కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో హేమంత్ ఒక వ్యక్తితో వాగ్వాదానికి దిగడం కనిపించింది. ఇంతలో హఠాత్తుగా రిచర్డ్ లూయిస్ హేమంత్ ముఖంపై బలంగా కొట్టాడు. దీంతో హేమంత్ వెంటనే కిందపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. హేమంత్‌కు తగలరాని చోట బలంగా దెబ్బతగలడంతో తిరిగి లేవలేని స్థితిలో మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..